హెటిరో గ్రూప్స్‌కు రేవంత్ సర్కార్ షాక్
మార్కెట్ లో ప్రస్తుతం ఆ భూముల విలువ 500 కోట్ల రూపాయల పైమాటే ఉంటుందని చెబుతున్నారు. దీంతో ఆ భూకేటాయింపులను వాపస్ తీసుకోవాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది.

Telangana Government Gives Shock To Hetero Groups
Hetero Groups : హెటిరో గ్రూప్స్ కు రేవంత్ సర్కార్ షాక్ ఇచ్చింది. గతంలో హెటిరోకు ఇచ్చిన భూకేటాయింపులకు రేవంత్ రెడ్డి సర్కార్ బ్రేక్ వేసింది. హెటిరో అధినేత పార్థసారథికి చెందిన సాయి సింధు ఫౌండేషన్ కు గత ప్రభుత్వం 15 ఎకరాలను కేటాయించింది. తాజాగా ఆ కేటాయింపులకు సంబంధించిన జీవో నెంబర్ 140ని నిలిపివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Also Read : పార్లమెంట్ ఎన్నికలు.. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు వీరేనా?
గత బీఆర్ఎస్ ప్రభుత్వం సాయి సింధు ఫౌండేషన్ కు ఖానామెట్ లో 15ఎకరాల భూమిని నామా మాత్రపు ధరకే 30ఏళ్ల పాటు లీజుకు ఇచ్చింది. ఏడాదికి లక్ష 47వేలు చెల్లించేలా వెసులుబాటు కల్పించింది. అయితే, మార్కెట్ లో ప్రస్తుతం ఆ భూముల విలువ 500 కోట్ల రూపాయల పైమాటే ఉంటుందని చెబుతున్నారు. దీంతో ఆ భూకేటాయింపులను వాపస్ తీసుకోవాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది.