పార్లమెంట్ ఎన్నికలు.. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు వీరేనా?
డీసీసీ అధ్యక్షుల నుంచి వచ్చిన జాబితాలోని నాయకుల పేర్లను పీఈసీ పరిశీలించనుంది. అర్హులైన నాయకుల పేర్లతో ఒక జాబితాను రూపొందించనుంది.

PEC Focus On Congress MP Candidates List
Congress MP Candidates List : లోక్ సభ ఎన్నికలపై ఫోకస్ పెంచింది కాంగ్రెస్ పార్టీ. హైదరాబాద్ గాంధీభవన్ లో తెలంగాణ ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ భేటీ కానుంది. పీఈసీ కమిటీ ఛైర్మన్, సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి ఏఐసీసీ ఇంఛార్జ్ దీపాదాస్ మున్షి హాజరుకానున్నారు. ఎంపీ అభ్యర్థుల ఎంపికపై తొలి దశ కసరత్తు చేయనుంది పీఈసీ. ఇప్పటికే ఆయా లోక్ సభ నియోజకవర్గాల పరిధిలో టికెట్ ఆశిస్తున్న నాయకుల పేర్లను తెలంగాణ ప్రదేశ్ ఎన్నికల కమిటీకి పంపించారు డీసీసీ అధ్యక్షులు. మరికొంత మంది జాబితాను కూడా అందజేయనున్నారు.
డీసీసీ అధ్యక్షుల నుంచి వచ్చిన జాబితాలోని నాయకుల పేర్లను పీఈసీ పరిశీలించనుంది. అర్హులైన నాయకుల పేర్లతో ఒక జాబితాను రూపొందించనుంది. ఆ జాబితాను కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీకి సిఫార్సు చేయనుంది. వచ్చే నెల 5,6 తేదీల్లో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన జాబితాలపై చర్చించనుంది కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ.
Also Read : తెలంగాణలో బీఆర్ఎస్‌కు కొత్త టెన్షన్.. సీఎం రేవంత్‌తో ఎమ్మెల్యేల భేటీపై గులాబీ వర్గాల్లో గుబులు..!
ఆశావహుల జాబితా..!
* మహబూబాబాద్ (ఎస్టీ) – బలరాం నాయక్, బెల్లయ్య నాయక్, కాశీరాం నాయక్
* ఖమ్మం (జనరల్) – సోనియా గాంధీ, రేణుకా చౌదరి, పొంగులేటి ప్రసాద్ రెడ్డి, వీహెచ్
* ఖమ్మం లోక్ సభకు సోనియా గాంధీ పోటీ చేస్తారనే ప్రచారం
* హైదరాబాద్ (జనరల్) – ఫిరోజ్ ఖాన్, అజారుద్దీన్
* కరీంనగర్ (జనరల్) ప్రవీణ్ రెడ్డి, రుద్ర సంతోష్ కుమార్, నేరెళ్ల శారద, రోహిత్ రావు
* పెద్దపల్లి (ఎస్సీ) – గడ్డం వంశీ, నల్లాల ఓదెలు
* నిజామాబాద్ (జనరల్ ) – ఈరవత్రి అనిల్, జీవన్ రెడ్డి, సునీల్ రెడ్డి, దిల్ రాజు
* మెదక్ (జనరల్) – జగ్గారెడ్డి, త్రిష (దామోదర రాజనర్సింహ కూతురు), జయారెడ్డి(జగ్గారెడ్డి కూతురు)
* జహీరాబాద్ (జనరల్ ) – సురేశ్ షెట్కార్
* మల్కాజ్ గిరి (జనరల్) – మైనంపల్లి హన్మంతరావు, హరివర్ధన్ రెడ్డి, నర్సారెడ్డి భూపతిరెడ్డి
* సికింద్రాబాద్ (జనరల్) – అనిల్ కుమార్ యాదవ్, వేణుగోపాల్ స్వామి, రోహిన్ రెడ్డి
* చేవేళ్ల (జనరల్) చిగురింత పారిజాత నర్సింహారెడ్డి, కేఎల్ఆర్
* మహబూబ్ నగర్ (జనరల్) – జీవన్ రెడ్డి, వంశీచంద్ రెడ్డి, జిల్లెల ఆదిత్య రెడ్డి, సీతాదయాకర్ రెడ్డి
* నల్గొండ (జనరల్) – జానారెడ్డి, రఘువీర్ రెడ్డి(జానారెడ్డి కొడుకు), పటేల్ రమేశ్ రెడ్డి
* భువనగిరి (జనరల్) – చామల కిరణ్ కుమార్ రెడ్డి, పున్నా కైలాశ్ నేత, శివసేనా రెడ్డి, పవన్ కుమార్ రెడ్డి
* వరంగల్ (ఎస్సీ) – అద్దంకి దయాకర్, సిరిసిల్ల రాజయ్య, సర్వే సత్యనారాయణ
* నాగర్ కర్నూల్ (ఎస్సీ) – సంపత్ కుమార్, మల్లు రవి, చారకొండ వెంకటేశ్
* ఆదిలాబాద్ (ఎస్టీ) – నరేశ్ జాదవ్, సేవాలాల్ రాథోడ్
Also Read : తెలంగాణ కాంగ్రెస్ కీలక నిర్ణయం.. ఎంపీ బరిలో సోనియా గాంధీ..!