రేషన్ కార్డులు వచ్చేస్తున్నాయ్.. ఈ నెలలోనే.. డేట్ ఇదే.. మీరు అప్లై చేశారా?
రేషన్ కార్డుకు అప్లయ్ చేసుకున్నారా.. అయితే, మీకు శుభవార్త. కొత్త రేషన్ కార్డులు వస్తున్నాయి.

Ration cards
Ration Cards: రేషన్ కార్డుకు అప్లయ్ చేసుకున్నారా.. అయితే, మీకు శుభవార్త. కొత్త రేషన్ కార్డులు వస్తున్నాయి. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకున్న వారందరికీ నూతన కార్డులు మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
ఈనెల 14వ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డులు పంపిణీ ప్రారంభిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కొత్త రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభిస్తారని ఉత్తమ్ చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటినుంచి అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు అందజేస్తున్నట్లు మంత్రి చెప్పారు.
రేషన్ కార్డు కోసం వచ్చిన అప్లికేషన్ల పరిశీలనను ఈనెల 13లోగా పూర్తిచేసి, అర్హులైన వారిని ఎంపిక చేయాలని అధికారులను మంత్రి ఉత్తమ్ ఆదేశించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో 2.89 కోట్ల మందికి సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని, 99 శాతం మంది ప్రజలు ఈ బియ్యాన్ని తీసుకుంటున్నారని మంత్రి చెప్పారు.