DAV Public School : ప్రభుత్వం కీలక నిర్ణయం.. DAV స్కూల్ పునః ప్రారంభానికి సుముఖత
బంజారాహిల్స్ డీఏవీ పబ్లిక్ స్కూల్ రీఓపెన్ విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎట్టకేలకు DAV స్కూల్ పునః ప్రారంభానికి తెలంగాణ ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది.

DAV Public School : బంజారాహిల్స్ డీఏవీ పబ్లిక్ స్కూల్ రీఓపెన్ విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎట్టకేలకు DAV స్కూల్ పునః ప్రారంభానికి తెలంగాణ ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. బుధవారం నుంచి DAV స్కూల్ రీ ఓపెన్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. దీనిపై పాఠశాల విద్యాశాఖ అధికారికంగా ప్రకటన చేయనుంది.
హైదరాబాద్ బంజారాహిల్స్ లోని డీఏవీ పబ్లిక్ స్కూల్‌లో ఎల్కేజీ చదువుతున్న నాలుగేళ్ల చిన్నారిపై స్కూల్ ప్రిన్సిపాల్ కారు డ్రైవర్ రజనీకుమార్ లైంగిక వేధింపులకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటన నగరంలో కలకలం రేపింది. ఈ క్రమంలో పాఠశాల గుర్తింపును రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. అయితే, విద్యా సంవత్సరం మధ్యలో పాఠశాల గుర్తింపు రద్దు చేయడంతో విద్యార్థుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారుతుందని తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, స్కూల్ ని రీఓపెన్ చేయాలని ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి పెంచారు. దీంతో పాఠశాలను తిరిగి తెరవాలని ప్రభుత్వం నిర్ణయించింది.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.
మరోవైపు పాఠశాల యాజమాన్యం కూడా గుర్తింపు రద్దు అంశంపై విద్యాశాఖ అధికారులతో చర్చలు జరిపింది. జరిగిన ఘటన సహించరానిది అయినా పాఠశాల గుర్తింపు రద్దు సమంజసం కాదని విద్యావేత్తలు సైతం అభిప్రాయపడ్డారు.
డీఏవీ పబ్లిక్ స్కూల్ గుర్తింపు రద్దును వెనక్కి తీసుకొని స్కూల్‌ను తెరవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. అవసరమైతే ప్రభుత్వం స్కూల్‌ను స్వాధీనం చేసుకోవాలని, పాఠశాలలో సీసీ కెమెరాలు, కమిటీని ఏర్పాటు చేసి పూర్తి రక్షణ కల్పించి స్కూల్ కొనసాగించాలని కోరారు. ఇప్పటికిప్పుడు ప్రభుత్వం ఇచ్చి ఆప్షన్ల ప్రకారం మరో పాఠశాలలో తమ పిల్లలను చేర్చడం తమకు ఎంతమాత్రం ఇష్టం లేదన్నారు తల్లిదండ్రులు. ఇది తల్లిదండ్రులపై ఆర్థిక భారంతో పాటు దూరాభారం కూడా అవుతుందన్నారు.