Telangana Govt : తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. ఉద్యోగులకు దసరా బొనాంజా..!

ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా పాత పెన్షన్ పునరుద్ధరణ ఇతర సానుకూల హామీలకు అయ్యే వ్యయాలు, భారాలపై ప్రభుత్వం ఆరా తీస్తోంది.

Telangana Govt : తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. ఉద్యోగులకు దసరా బొనాంజా..!

Telangana Govt

Updated On : September 20, 2025 / 9:46 AM IST

Telangana Govt : ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఇటీవల తెలంగాణ సర్కార్ సానుకూల నిర్ణయాలు తీసుకుంది. పెండింగ్‌లో ఉన్న రెండు డీఏ బకాయిలను చెల్లించాలని నిర్ణయించడం, ప్రభుత్వ ఉద్యోగుల కోసం కొత్త ఆరోగ్య బీమా పథకాన్ని ప్రవేశపెట్టడం, అలాగే పెండింగ్ బిల్లుల చెల్లింపు కోసం రూ.700 కోట్లు విడుదల చేయడం వంటివి ఇప్పటికే చర్చల దశలో ఉండగా.. ఇక వీటిని దసరా పండుగకు ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా పాత పెన్షన్ పునరుద్ధరణ ఇతర సానుకూల హామీలకు అయ్యే వ్యయాలు, భారాలపై ప్రభుత్వం ఆరా తీస్తోంది.

Also Read: H1B Visa Fee : భారతీయులకు బిగ్ షాకిచ్చిన ట్రంప్.. హెచ్-1బీ వీసా నిబంధనల్లో భారీ మార్పులు.. లక్ష డాలర్లు చెల్లించాల్సిందే..

తెలంగాణ ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న ఐదు డీఏలలో రెండు డీఏల బకాయిలను చెల్లించింది. ఇక కొత్త ఆరోగ్య బీమా పథకం అందించనుంది. ఉద్యోగులకు మెరుగైన ఆరోగ్య బీమాను అందించడానికి ఒక ట్రస్టును ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో ఉద్యోగులు, ప్రభుత్వం చెల్లించే మొత్తాలను జమ చేస్తారు. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బిల్లుల చెల్లింపు కోసం రూ.700 కోట్లు విడుదల చేసింది. అందులో రూ.392 కోట్లు సప్లిమెంటరీ వేతన బిల్లులకు కేటాయించారు.

రాష్ట్రంలో జీవో 317 ద్వారా ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులను జిల్లాలు, జోన్లకు కేటాయించిన నేపథ్యంలో నష్టపోయిన వారికి ప్రభుత్వం తాత్కాలిక ఉపశమనం కలిగించింది. సొంత జిల్లాలను వదిలి ఇతర జిల్లాలు, జోన్లకు వెళ్లిన వారికి ఖాళీల లభ్యత ఆధారంగా కోరుకున్న చోట గరిష్ఠంగా మూడేళ్లపాటు డిప్యూటేషన్ పై పనిచేసే అవకాశం కల్పించింది ప్రభుత్వం.

రాష్ట్రంలో జీవో 317 ద్వారా ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులను జిల్లాలు, జోన్లకు కేటాయించిన నేపథ్యంలో నష్టపోయిన వారికి ప్రభుత్వం తాత్కాలిక ఉపశమనం కలిగించింది. సొంత జిల్లాలను వదిలి ఇతర జిల్లాలు, జోన్లకు వెళ్లిన వారికి ఖాళీల లభ్యత ఆధారంగా కోరుకున్న చోట గరిష్ఠంగా మూడేళ్ల పాటు డిప్యూటేషన్ పై పనిచేసే అవకాశం కల్పించింది. ఈ మేరకు ఇప్పటికే జీవిత భాగస్వామి, పరస్పర బదిలీలు చేశారు. ఇప్పుడు మిగిలిపోయిన వారికి డిప్యుటేషన్లు ఇవ్వాలని నిర్ణయించారు.

జీవో 317 ద్వారా 25000 మంది ఉపాధ్యాయులు తమ సొంత జిల్లాలను వదిలి ఇతర జిల్లాలకు వెళ్లారు. వారిలో సుమారు 6వేల మంది జీవిత భాగస్వాములు, పరస్పర బదిలీల ద్వారా సొంత జిల్లాలకు, కోరుకున్న జిల్లాలకు వచ్చారు. ఇక 19వేల మంది మిగిలి ఉన్నారు. పదోన్నతులు పొందిన వారు తప్ప.. మిగిలిన వారు తాత్కాలిక బదిలీలకు అర్హులు. అదే తరహాలో ఇతర శాఖల ఉద్యోగులు డిప్యూటేషన్లపై మూడేళ్లపాటు కోరుకున్న జిల్లాలో పనిచేయొచ్చు. మొత్తానికి దసరా పండుగ నేపథ్యంలో పలు అంశాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొని ఉద్యోగులకు భారీ ఊరట కలిగించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.