Telangana Government : తెలంగాణ ప్రభుత్వం తీపికబురు.. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు రూ.304.61 కోట్ల పరిహారం విడుదల
ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో రెండు విడతల్లో కురిసిన భారీ అకాల వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 4.56 లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ తేల్చింది

TS Govt compensation
TS Govt compensation Farmers : అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా నిలిచింది. పంట నష్టపోయిన రైతులకు రూ.304.61 కోట్ల పరిహారాన్ని విడుదల చేసింది. ఈ మేరకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ విభాగం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో మార్చి 22 నుంచి ఏప్రిల్ 27వరకు అకాల వర్షాలు బీభత్సం సృష్టించాయి.
భారీ వర్షాలకు చేతికొచ్చిన పంట నీటి పాలైంది. దీంతో రైతులు తీవ్రంగా నష్టం పోయారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులకు ధైర్యం చెప్పారు. దీంతోపాటు ఎకరాకు రూ.10 వేల ఆర్థికసాయాన్ని ప్రకటించారు. ఎంత నష్టం జరిగిందో అంచనా వేసి ఆ రైతులకు పరిహారాన్ని అందించాలని ఆదేశించారు.
పంట నష్టంపై సర్వే చేసిన వ్యవసాయం శాఖ రాష్ట్ర వ్యాప్తంగా 2.79 లక్షల మంది రైతులకు
సంబంధించిన 3.04 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు గుర్తించారు. దీనికి కారణంగా ఎకరాకు
రూ.10 వేల చొప్పున రూ.304.61 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
త్వరలోనే ఈ పరిహారం నిధులను రైతులను ఖాతాల్లో జమ చేయనున్నారు. అంతకముందు మార్చి 17 నుంచి 21 వరకు కురిసిన అకాల వర్షాలకు రాష్ట్రంలో 1.30 లక్షల మంది రైతులకు చెందిన 1.51 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రూ.151.64 కోట్ల పరిహారాన్ని రైతుల ఖాతాల్లో జమ చేసింది.
Amartya Sen : ఉమ్మడి పౌరస్మృతిపై నోబెల్ అవార్డు గ్రహీత అమర్త్యసేన్ కీలక వ్యాఖ్యలు
ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో రెండు విడతల్లో కురిసిన భారీ అకాల వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 4.56 లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ తేల్చింది. ఎకరాకు రూ.10 వేల చొప్పున రూ.456.25 కోట్ల నష్టపరిహారాన్ని విడుదల చేసింది.