ఎకరం రూ.104 కోట్లు.. హైదరాబాద్‌లో భూముల వేలానికి ప్రభుత్వం నిర్ణయం.. ఫుల్ డీటెయిల్స్
టీజీఐఐసీ ఇప్పటికే రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్స్ పిలిచి, టెండర్ దాఖలుకు వచ్చేనెల 8 వరకు గడువు ఇస్తున్నట్లు తెలిపింది.

తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో 66 ఎకరాల భూములను వేయాలని నిర్ణయించింది. తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్-టీజీఐఐసీ ద్వారా వీటిని అమ్మేయనుంది. రాయదుర్గంలో 4, ఉస్మాన్ సాగర్‌లో 13 ప్లాట్లను వేలం వేయనుంది.
టీజీఐఐసీ ఇప్పటికే రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్స్ పిలిచి, టెండర్ దాఖలుకు వచ్చేనెల 8 వరకు గడువు ఇస్తున్నట్లు తెలిపింది. వచ్చేనెల 8న టీజీఐఐసీ బోర్డు రూమ్‌లో టెక్నికల్ ప్రజెంటేషన్ ఇస్తారు. అనంతరం 12వ తేదీన టెండర్ అవార్డు ఇస్తారు.
రాయదుర్గం భూ వేలానికి సంబంధించిన సమాచారం..
ప్లాట్ 15A/2
- మార్కెట్ ధర: రూ.71.60 కోట్లు
- అప్‌సెట్ ప్రైస్: రూ.50.10 కోట్లు
- విస్తీర్ణం: 7.67 ఎకరాలు
ప్లాట్ 19
- మార్కెట్ ధర: రూ.66.30 కోట్లు
- అప్‌సెట్ ప్రైస్: రూ.44.30 కోట్లు
- విస్తీర్ణం: 11 ఎకరాలు
ప్లాట్లు 14B/1, 14A/1
మార్కెట్ ధర: చదరపు గజానికి రూ.2,16,405
అప్‌సెట్ ప్రైస్: చదరపు గజానికి రూ.1,51,484
ఎకరానికి ధర (మార్కెట్) అంచనా ప్రకారం: రూ.104.74 కోట్లు
అప్‌సెట్ ప్రైస్ (ఎకరానికి): రూ.73.32 కోట్లు
మొత్తం వేలం భూమి: రాయదుర్గంలో మొత్తం 19.67 ఎకరాల విక్రయం
ఉస్మాన్ సాగర్ వద్ద ప్లాట్లు
వేలానికి ఉద్దేశించిన ప్లాట్లు: 1 నుంచి 15 వరకు (ప్లాట్లు 8, 10 మినహా)
మార్కెట్ ధర: రూ.18.70 కోట్లు నుంచి రూ.25 కోట్లు (ప్లాట్‌ను బట్టి భిన్నంగా)