Double Bedroom : నేడు లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ.. ఒకే రోజు 11,700 ఇళ్లను పేదలకు పంపిణీ

లాటరీ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేశారు. మొత్తం ఏడున్నర లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే అందులో 95 వేల మందితో ఎలిజిబిలిటీ లిస్టు సిద్ధం అయింది. దశల వారిగా వారికి ఇళ్లను పంపిణీ చేస్తామని ప్రభుత్వం అంటోంది.

Double Bedroom : నేడు లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ.. ఒకే రోజు 11,700 ఇళ్లను పేదలకు పంపిణీ

double bedroom houses

Updated On : September 2, 2023 / 7:28 AM IST

Double Bedroom Houses Distribution : ప్రజలు ఎంతో ఆతృతగా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రెండు పడకల గదుల ఇళ్ల పంపిణీ కార్యక్రమం ఇవాళ జరుగనుంది. ఒకే రోజు 11,700 ఇళ్లను 24 నియోజకవర్గాల్లోని పేదలకు పంపిణీ చేయడానికి జీహెచ్ఎసీం ఏర్పాట్లు చేస్తోంది. ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ నగరంలో లక్ష ఇళ్ల నిర్మాణం చేపట్టింది. అయితే అందులో 64 వేళ ఇళ్లు పంపిణీ చేయటానికి సిద్ధంగా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.

ఇందులో చాలా వరకు మూడేళ్ల క్రితమే ఇళ్ల నిర్మాణం పూర్తి కాగా, మరికొద్ది నెలల క్రితం కొన్ని ఇళ్లు పూర్తైన ఉన్నాయి. అయినా వాటి కేటాయింపు ఆలస్యమవుతూ వస్తోంది. ఎక్కడైతై ఇక అక్కడే ఉన్న స్లమ్స్ ను తొలగించి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం చేసిన చోట అక్కడున్న లబ్ధిదారులకు కేటాయించగా మిగిలిన వారిని కొన్ని రోజుల క్రితం ప్రతి నియోజకవర్గంలో 500 మంది లబ్ధిదారులను గుర్తించారు.

Shamshabad : రూ.50 లక్షల్లో డబుల్ బెడ్ రూమ్ ప్లాట్.. శంషాబాద్‌ వైపే భవిష్యత్తు రియల్ ఎస్టేట్

లాటరీ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేశారు. మొత్తం ఏడున్నర లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే అందులో 95 వేల మందితో ఎలిజిబిలిటీ లిస్టు సిద్ధం అయింది. దశల వారిగా వారికి ఇళ్లను పంపిణీ చేస్తామని ప్రభుత్వం అంటోంది. దేశంలో ఎక్కడాలేని విధంగా డిగ్నిటీ హౌసింగ్ ప్రోగ్రామ్ ను తెలంగాణ సర్కార్ చేపట్టిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.

ఎకరం 30 నుంచి 50 కోట్ల విలువైన స్థలాల్లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం చేశామని తెలిపారు. మరో 15 రోజుల్లో రెండు విడతలో నియోజకవర్గానికి మరో 500 ఇళ్ల చొప్పున పంపిణీ చేస్తామన్నారు. మొత్తం 6 విడతల్లో ఇళ్ల పంపిణీ చేస్తామని, ప్రజలెవరూ అధైర్య పడొద్దన్నారు.