Governor Tamilisai : ప్రవళిక మృతిపై 48 గంటల్లో నివేదిక ఇవ్వాలని గవర్నర్‌ తమిళిసై ఆదేశం

ప్రవళిక మృతిపై 48 గంటల్లో నివేదిక ఇవ్వాలని గవర్నర్ తమిళిసై ఆదేశాలు జారీ చేశారు. తెలంగాన ప్రభుత్వం సీఎస్,డీజీపీ, TSPSC సెక్రటరీలకు ఆదేశాలు జారీ చేశారు.

Governor Tamilisai : ప్రవళిక మృతిపై 48 గంటల్లో నివేదిక ఇవ్వాలని గవర్నర్‌ తమిళిసై ఆదేశం

governor tamilisai

Telangana governor tamilisai : ప్రవళిక మృతిపై 48 గంటల్లో నివేదిక ఇవ్వాలని గవర్నర్ తమిళిసై ఆదేశాలు జారీ చేశారు. తెలంగాన ప్రభుత్వం సీఎస్,డీజీపీ, TSPSC సెక్రటరీలకు ఆదేశాలు జారీ చేశారు. కాగా తెలంగాణలో గ్రూప్-2 పరీక్షలు వాయిదా పడ్డాయి. దీంతో ఈ పరీక్షల కోసం ఎదురు చూస్తున్నవారు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈక్రమంలో ప్రవళిక అనే యువతి ఆత్మహత్యకు పాల్పడింది. గ్రూప్ -2 పరీక్షలు వాయిదా పడ్డాయని మనస్తాపంతో ప్రవళిక ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తోంది.

ఈక్రమంలో ప్రవళిక మరణంపై ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. ప్రవళికది బలవన్మరణం కాదని ఇది ప్రభుత్వ హత్య అంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ట్వీట్ ద్వారా పేర్కొన్నారు.

అలాగే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఆత్మహత్య చేసుకున్న ఆడబిడ్డ ప్రవల్లిక తరపున న్యాయం కావాలని వేల గొంతులు నినదిస్తున్నా..కేసీఆర్ చెవికి వినబడటం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. అదే సమయంలో బతుకమ్మ సంబరాల గురించి రంగురంగుల వీడియోలు పెట్టే ఎమ్మెల్సీ కవితకు…గ్రూప్ పరీక్షల నిర్వహణ అవకతవకలతో బతుకు భారమై, భవిత ఆగమై ఆత్మహత్య చేసుకున్న ప్రవల్లిక ఆత్మ ఘోష వినబడటం లేదా!?అంటూ సెటైర్లు వేస్తు ప్రశ్నించారు.

గ్రూప్‌-2 పరీక్షల కోసం వేయి కళ్లతో వేచి చూస్తున్న యువతి ప్రవళిక ఆత్మహత్యపై గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్ స్పందించారు. ప్రవళిక మృతిపై 48 గంటల్లోగా నివేదిక ఇవ్వాలని సీఎస్‌, డీజీపీ, టీఎస్‌పీఎస్సీ కార్యదర్శిని గవర్నర్‌ ఆదేశించారు.

కాగా వరంగల్‌ జిల్లాకు చెందిన మర్రి ప్రవళిక అశోక్‌నగర్‌లోని ఓ హాస్టల్‌లో ఉంటూ గ్రూప్‌-2 పోటీ పరీక్షలకు సిద్దమవుతోంది. ఈక్రమంలో గ్రూప్ -2 పరీక్షలు వాయిదా పడ్డాయనే సమాచారం తెలుసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లుగా సమాచారం. ఈక్రమంలో ప్రవళిక మరణంపై 48గంటల్లో నివేదిక ఇవ్వాలని గవర్నర్ తమిళిసై ఆదేశాలు జారీ చేశారు.