రేషన్ కార్డుకోసం అప్లయ్ చేసినోళ్లకు భారీ శుభవార్త.. ఆ రోజు నుంచే కార్డుల పంపిణీ.. రేషన్ మాత్రం ఇప్పట్లో ఇవ్వరు..

కొత్త రేషన్ కార్డులు రాబోతున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

రేషన్ కార్డుకోసం అప్లయ్ చేసినోళ్లకు భారీ శుభవార్త.. ఆ రోజు నుంచే కార్డుల పంపిణీ.. రేషన్ మాత్రం ఇప్పట్లో ఇవ్వరు..

Ration Cards

Updated On : July 9, 2025 / 7:59 AM IST

Ration Cards: తెలంగాణలోని అర్హత కలిగిన ప్రతిఒక్కరికి రేషన్ కార్డును అందించేలా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఈ క్రమంలో అర్హులైన వారు రేషన్ కార్డుకోసం ఇప్పటికే అప్లయ్ చేసుకున్నారు. అయితే, వారికి కొత్త రేషన్ కార్డులు రాబోతున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెద్దెత్తున కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.

Also Read: అర్ధరాత్రి ముంచుకొచ్చిన ఉపద్రవం.. 67మంది ప్రాణాలను కాపాడిన కుక్క.. అసలేం జరిగిందంటే?

తెలంగాణ ప్రభుత్వం పేదలకు కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు దరఖాస్తులు తీసుకుంటూ వస్తోంది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకున్న వారిలో అధికారుల వెరిఫికేషన్ తరువాత అర్హత కలిగిన వారికి కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దీంతో ఈనెల 14వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తికి వెళ్లి కొత్త రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు. అయితే, ఈనెల 14వ తేదీన ఇచ్చే కార్డులు వెరిఫికేషన్ పూర్తయినవి మాత్రమేనని, దరఖాస్తులు, వెరిఫికేషన్, పంపిణీ అనేది నిరంతర ప్రక్రియగా ఉంటుందని సివిల్ సప్లయ్ అధికారులు చెప్పారు.

కొత్త రేషన్ కార్డులు అందుకుంటున్న వారికి రేషన్ బియ్యం పంపిణీ ఇప్పట్లో ఉండదని తెలుస్తోంది. గత నెలలోనే మూడు నెలలకు సంబంధించి బియ్యాన్ని రేషన్ కార్డు దారులకు అందజేశారు. దీంతో మళ్లీ సెప్టెంబర్ నెలలో రేషన్ సరుకులు కార్డుదారులకు అందించనున్నారు. దీంతో ప్రస్తుతం కొత్త రేషన్ కార్డులు అందుకునేవారికి సెప్టెంబర్ నుంచి సురుకుల పంపిణీ ఉంటుందని అధికారులు తెలిపారు.

రాష్ట్ర రాజధాని హైదరాబాద్ పరిధిలో ఇప్పటి వరకు 2.5లక్షల దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. రేషన్ కార్డుల దరఖాస్తుల స్వీకరణ నిరంతరం ఉంటుందని ప్రకటించడంతో రోజుకు దాదాపు 5వేల నుంచి 6వేల దరఖాస్తులు మీ సేవా కేంద్రాల్లో నమోదవుతున్నాయని చెబుతున్నారు. ఇలా వచ్చిన దరఖాస్తులను సర్కిళ్ల వారీగా ఏఎస్ఓలు పరిశీలించి వెరిఫికేషన్ పనులను ఆర్ఐలకు అప్పగిస్తున్నారు. వారు దరఖాస్తుదారులు పేర్కొన్న చిరునామాలకు వెళ్లి వెరిఫికేషన్ పూర్తి చేస్తున్నారు.

ప్రస్తుతం హైదరాబాద్ నగరంలోని తొమ్మిది సర్కిళ్ల పరిధిలో 6,39,451 కార్డులు ఉన్నాయి. మరో ఏడాదిలో లక్షకుపైగా కొత్త కార్డులు ఇస్తామని అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే.. ఈనెల 14న నగరంలోని తొమ్మిది సర్కిళ్ల పరిధిలో 29,287మందికి కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయడం జరుగుతుందని అధికారులు తెలిపారు.