తెలంగాణలో టెన్త్ స్టూడెంట్స్‌కు గుడ్‌న్యూస్‌.. సాయంత్రం వేళల్లో ఆరు రకాలతో అదిరిపోయే స్నాక్స్..

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదివే విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.

తెలంగాణలో టెన్త్ స్టూడెంట్స్‌కు గుడ్‌న్యూస్‌.. సాయంత్రం వేళల్లో ఆరు రకాలతో అదిరిపోయే స్నాక్స్..

Evening Snacks

Updated On : January 30, 2025 / 11:42 AM IST

Tenth Students Evening Snacks: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదివే విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో మార్చి 21నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు పదో తరగతి పబ్లిక్ పరీక్షలు జరగనున్నాయి. ఇప్పటికే షెడ్యూల్ సైతం విడుదలైంది. ఈ నేపథ్యంలో ఈసారి ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు స్పెషల్ క్లాసులు నిర్వహించాలని స్కూల్ ఎడ్యకేషన్ అధికారులు ఆదేశించారు. ఇప్పటికే స్పెషల్ క్లాసులు ప్రారంభమయ్యాయి. స్పెషల్ క్లాసులకు హాజరయ్యే టెన్త్ విద్యార్థులకు సాయంత్రం స్నాక్స్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Also Read : గత కొన్నాళ్లుగా గమ్మున ఉంటున్న మల్లన్న.. రేవంత్‌ను కలిశాకే ఆయన మౌనంగా ఉంటున్నారని టాక్

ఫిబ్రవరి 1వ తేదీ నుంచి మార్చి 20వ తేదీ వరకు విద్యార్థులకు స్నాక్స్ అందించనున్నారు. ఇందుకు సంబంధించిన మెనూకూడా విద్యాశాఖ అధికారులు రూపొందించారు. ఆరు రకాల స్నాక్స్ ఇవ్వాలని నిర్ణయించారు. ఇందుకోసం ఒక్కో స్టూడెంట్ కు రోజుకు రూ.15చొప్పున ఖర్చు చేయనున్నారు. స్నాక్స్ రూపంలో ఉడకబెట్టిన పెసర్లు, బొబ్బర్లు, పల్లీపట్టి, మిల్లెట్ బిస్కెట్లు, ఉల్లిగడ్డ పకోడీ, ఉల్లిగడ్డ శనగలు అందించాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఇందుకు సంబంధించిన నిధులను స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఖతాల్లో వేయనున్నారు.

Also Read: Mohammed Siraj : మొన్న చెల్లెలు అన్నావ్‌.. మ‌రీ ఇప్పుడు ఏం చెబుతావు..? బిగ్‌బాస్ బ్యూటీతో సిరాజ్ స‌మ్‌థింగ్.. స‌మ్‌థింగ్‌..

రాష్ట్రంలో పలు ప్రభుత్వ బడుల్లో టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ కు టీచర్లు, ఎన్జీవోల ద్వారా నిధులు సేకరించి స్నాక్స్ అందిస్తున్నారు. ప్రస్తుతం అన్ని పాఠశాలల్లోనూ స్పెషల్ క్లాసులకు హాజరయ్యే టెన్త్ విద్యార్థులకు స్నాక్స్ అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం పట్ల విద్యార్థి, టీచర్ల సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఇదిలాఉంటే.. తెలంగాణలో టెన్త్ పరీక్షలు మార్చి 21న ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 2వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. పరీక్ష తేదీల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఎగ్జామ్స్ జరగుతాయి. ఈ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు ఫిబ్రవరి చివరి వారంలో లేదా మార్చి మొదటి వారంలో అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉండనున్నాయి.