Mohammed Siraj : మొన్న చెల్లెలు అన్నావ్‌.. మ‌రిప్పుడు ఏం చెబుతావు..? బిగ్‌బాస్ బ్యూటీతో సిరాజ్ స‌మ్‌థింగ్.. స‌మ్‌థింగ్‌..

బిగ్‌బాస్ బ్యూటీతో మ‌హ్మ‌ద్ సిరాజ్ ప్రేమ‌లో ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.

Mohammed Siraj : మొన్న చెల్లెలు అన్నావ్‌.. మ‌రిప్పుడు ఏం చెబుతావు..? బిగ్‌బాస్ బ్యూటీతో సిరాజ్ స‌మ్‌థింగ్.. స‌మ్‌థింగ్‌..

Who is Mohammed Siraj rumoured girlfriend Mahira Sharma

Updated On : January 30, 2025 / 11:50 AM IST

ఇటీవ‌ల కాలంలో టీమ్ఇండియా పేస‌ర్‌, హైద‌రాబాద్ కుర్రాడు మ‌హ్మ‌ద్ సిర్మాజ్ ల‌వ్‌లో ప‌డిన‌ట్లుగా వార్త‌లు వ‌స్తున్నాయి. మొన్నామ‌ధ్య లెజెండ‌రీ సింగ‌ర్ ఆశా భోస్లే మ‌న‌వ‌రాలు జానాయ్ భోస్లేతో అత‌డు ప్రేమ‌లో ఉన్న‌ట్లు రూమ‌ర్లు వ‌చ్చాయి. వీటిని ఇద్ద‌రూ ఖండిచారు. పైగా ఆమె నా సోద‌రి లాంటిద‌ని సిరాజ్ అన‌గా, నా ప్రియ‌మైన సోద‌రుడు అంటూ జానాయ్ భోస్లే సోష‌ల్ మీడియా వేదిక‌గా క్లారిటీ ఇచ్చారు. దీంతో ఆ రూమ‌ర్‌కు ఫుల్ స్టాప్ ప‌డింది. అయితే.. ఇప్పుడు మ‌రో వార్త తెర‌పైకి వ‌చ్చింది. బిగ్‌బాస్ 13 బ్యూటీ మ‌హిరా శ‌ర్మ‌తో సిరాజ్ డేటింగ్‌లో ఉన్న‌ట్లు ఓ ఆంగ్ల మీడియాలో క‌థ‌నాలు వ‌స్తున్నాయి.

సిరాజ్‌, మ‌హిరా స‌న్నిహితులు సైతం వారి ప్రేమ‌ను క‌న్ఫ‌మ్ చేసిన‌ట్లుగా స‌ద‌రు వార్త‌ల సారాంశం. అంతేకాదండోయ్ మ‌హిరా ఈ వార్త‌ల‌ను ఖండిచ‌లేద‌ని దీంతో ఆమె సిరాజ్‌తో డేటింగ్‌లో ఉన్న వార్త‌లు నిజ‌మేన‌ని అర్థ‌మ‌వుతోంద‌ని చెబుతున్నారు. మ‌రి దీనిపై సిరాజ్, మ‌హిరా నేరుగా అయితే స్పందించ‌లేదు.

Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు టీమిండియాకు గుడ్‌న్యూస్‌..

మ‌హిరా ఎవ‌రు?
జమ్మూక‌శ్మీర్‌కు చెందిన మ‌హిరా అనేక పంజాబీ చిత్రాల్లో న‌టించింది. ఆల్బమ్ పాటల్లో కూడా కనిపించింది. నాగిన్, బెపనా ప్యార్, కుండలి భాగ్య (2019) వంటి సిరీయ‌ల్స్‌లో ఆమె న‌టించింది. ఇక హిందీ బిగ్‌బాస్ సీజ‌న్ 13లో పాల్గొని మంచి గుర్తింపు తెచ్చుకుంది.

సిరాజ్, మ‌హిరా ల మ‌ధ్య గతేడాది న‌వంబ‌ర్‌లో ప్రేమ క‌థ మొద‌లైన‌ట్లుగా తెలుస్తోంది. మ‌హిరాకు చెందిన ప‌లు ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌, పోస్టుల‌కు సిరాజ్ లైక్ చేశాడు. అంతేకాకుండా వీరిద్ద‌రు ఒక‌రినొక‌రు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవుతున్నారు. దీంతో వీరిద్ద‌రి మ‌ధ్ స‌మ్‌థింగ్‌.. స‌మ్‌థింగ్ అంటూ వార్త‌లు మొద‌లుఅయ్యాయి.

ICC T20 rankings : మ‌ళ్లీ అగ్ర‌స్థానాన్ని కైవ‌సం చేసుకున్న ఆదిల్ ర‌షీద్‌.. 25 స్థానాలు ఎగ‌బాకిన టీమ్ఇండియా మిస్ట‌రీ స్పిన్న‌ర్‌..

ఇదిలా ఉంటే.. ఫిబ్ర‌వ‌రి 19 నుంచి ఛాంపియ‌న్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో పాల్గొనే భార‌త జ‌ట్టులో మ‌హ్మ‌ద్ సిరాజ్‌కు చోటు ద‌క్క‌లేదు. అంతేకాదండోయ్ ఇంగ్లాండ్‌తో జ‌రుగుతున్న టీ20, వ‌న్డే సిరీస్‌ల‌కు అత‌డికి జ‌ట్టులో స్థానం ద‌క్క‌లేదు. కొంత‌కాలంగా అత‌డు పేల‌వ ఫామ్‌తో ఇబ్బంది ప‌డుతుండ‌డంతో సెల‌క్ట‌ర్లు అత‌డిని ప‌క్క‌న బెట్టినట్లుగా తెలుస్తోంది. ఛాంపియ‌న్స్ ట్రోఫీకి అత‌డి స్థానంలో అర్ష్‌దీప్ సింగ్‌ను తీసుకున్నారు. దేశ‌వాళీ టోర్నీ రంజీ ట్రోఫీలో మ‌హ్మ‌ద్ సిరాజ్ పాల్గొననున్నాడు. ఇక్క‌డ స‌త్తా చాటి మ‌రోసారి టీమ్ఇండియాలో రీ ఎంట్రీ ఇవ్వాల‌ని సిరాజ్ భావిస్తున్నాడు.