ICC T20 rankings : మళ్లీ అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్న ఆదిల్ రషీద్.. 25 స్థానాలు ఎగబాకిన టీమ్ఇండియా మిస్టరీ స్పిన్నర్..
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ బుధవారం ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌ను వెల్లడించింది.

England spinner Adil Rashid becomes no 1 T20I bowler in ICC latest rankings
భారత ఆటగాళ్లు ఐసీసీ తాజాగా ప్రకటించిన టీ20 ర్యాంకింగ్స్‌లో దుమ్ములేపారు. సూపర్ ఫామ్‌లో ఉన్న మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి మూడో టీ20 మ్యాచ్‌లోనూ అదరగొట్టాడు. నాలుగు ఓవర్లు వేసి 24 పరుగులే ఇచ్చి 5 వికెట్లతో సత్తా చాటాడు. ఈ మ్యాచ్‌లో భారత్ ఓడిపోయినప్పటికి అతడు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. ఈ క్రమంలో ఐసీసీ ర్యాంకింగ్స్‌లో ఏకంగా 25 స్థానాలు మెరుగుపరచుకుని ఏకంగా ఐదో స్థానానికి చేరుకున్నాడు. వరుణ్ చక్రవర్తి కెరీర్‌లో ఇదే అత్యుత్త ర్యాంక్ రావడం విశేషం.
అటు ఇంగ్లాండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ తిరిగి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. వెస్టిండీస్ బౌలర్ అకీల్ హోస్సేన్ రెండో స్థానంలో నిలిచాడు. భారత స్పిన్నర్ రవి బిష్ణోయ్ ఐదు స్థానాలు దిగజారాడు. 10వ ర్యాంకుకు పడిపోయాడు. అక్షర్ పటేల్ ఐదు స్థానాలు ఎగబాకి 11వ ర్యాంకు చేరుకున్నాడు. ఇంగ్లాండ్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ 13 స్థానాలు ఎగబాకి 6వ స్థానానికి చేరుకున్నాడు.
England veteran re-claims the top spot in the Men’s T20I Bowling Rankings following his exploits in India 👌
More ⬇https://t.co/dPrG1rTQ7R
— ICC (@ICC) January 29, 2025
ఐసీసీ టీ20 టాప్-5 బౌలింగ్ ర్యాంకింగ్స్..
ఆదిల్ రషీద్ (ఇంగ్లాండ్) – 718 రేటింగ్ పాయింట్లు
అకీల్ హోస్సేన్ (వెస్టిండీస్) – 707 రేటింగ్ పాయింట్లు
వనిందు హసరంగ (శ్రీలంక) – 698 రేటింగ్ పాయింట్లు
ఆడమ్ జంపా (ఆస్ట్రేలియా) – 694 రేటింగ్ పాయింట్లు
వరుణ్ చక్రవర్తి (భారత్) – 679 రేటింగ్ పాయింట్లు
తిలక్ @ 2
టీమ్ఇండియా యువ ఆటగాడు తిలక్ శర్మ కెరీర్ బెస్ట్ ఫామ్‌లో ఉన్నాడు. ఈ క్రమంలో అతడు తాజా ర్యాంకింగ్స్‌లో ఏకంగా రెండో స్థానానికి చేరుకున్నాడు. ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. వీరిద్దరికి మధ్య 23 రేటింగ్ పాయింట్ల వ్యత్యాసమే ఉంది. అటు ఇంగ్లాండ్ స్టార్ ఫిల్ సాల్ట్ ఓ స్థానం దిగజరా మూడో స్థానానికి పడిపోయాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నాలుగో స్థానంలోనే కొనసాగుతున్నాడు.
ఐసీసీ టీ20 టాప్-5 బ్యాటర్ల ర్యాంకింగ్స్..
ట్రావిస్ హెడ్ (ఆస్ట్రేలియా) – 855 రేటింగ్ పాయింట్లు
తిలక్ వర్మ (భారత్) -832 రేటింగ్ పాయింట్లు
ఫిల్ సాల్ట్ (ఇంగాండ్) – 782 రేటింగ్ పాయింట్లు
సూర్యకుమార్ యాదవ్ (భారత్) – 763 రేటింగ్ పాయింట్లు
జోస్ బట్లర్ (భారత్) – 749 రేటింగ్ పాయింట్లు