Cabinet Meeting: తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. డిసెంబర్ 9 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్ర‌యాణం

రాష్ట్ర మార్పు కోసం ఆరు గ్యారెంటీలను తప్పనిసరిగా అమలు చేస్తామని అన్నారు. దీనిపై కేబినెట్ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిపారు. వీటిపై శ్వేతపత్రం విడుదల చేస్తామని ఆయన అన్నారు.

Cabinet Meeting: తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. డిసెంబర్ 9 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్ర‌యాణం

ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలపై మొదటి కేబినెట్ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. కేబినెట్ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేబినెట్ మిటింగ్ నిర్ణయాల గురించి తెలియజేశారు. ఈ సమావేశంలో రెండు గ్యారెంటీలపై చర్చ జరిగిందని, వాటిని సోనియా గాంధీ పుట్టినరోజైన డిసెంబర్ 9 నుంచి అమలు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ఆ రెండు గ్యారెంటీల్లో ఒకటి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం , రెండవది రాజీవ్ ఆరోగ్యశ్రీ రూ.10లక్షలకు పెంపు.

రాష్ట్రంలో మార్పు కోసం 6 గ్యారెంటీలను తప్పనిసరిగా అమలు చేస్తామని అన్నారు. దీనిపై కేబినెట్ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిపారు. వీటిపై శ్వేతపత్రం విడుదల చేస్తామని ఆయన అన్నారు. రాష్ట్రంలో 24 గంటల విద్యుత్ కొనసాగిస్తామని ఆయన అన్నారు. రాబోయే 5 సంవత్సరాల్లో విద్యుత్ కు అంతరాయం కలగకుండా చూసుకుంటామన్నారు.