తెలంగాణ హైకోర్టులో కేసీఆర్‌కు బిగ్ షాక్.. పిటిషన్ కొట్టివేత

తెలంగాణ హైకోర్టులో మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు చుక్కెదురైంది. విద్యుత్ కొనుగోళ్లపై ప్రభుత్వం ఏర్పాటుచేసిన నరసింహారెడ్డి కమిషన్ ను రద్దుచేయాలని

తెలంగాణ హైకోర్టులో కేసీఆర్‌కు బిగ్ షాక్.. పిటిషన్ కొట్టివేత

KCR

KCR : తెలంగాణ హైకోర్టులో మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు చుక్కెదురైంది. విద్యుత్ కొనుగోళ్ల అంశంపై ఏర్పాటు చేసిన జస్టిస్ట్ నరసింహారెడ్డి కమిషన్ ను రద్దుచేయాలని కేసీఆర్ పిటీషన్ దాఖలు చేశారు. విద్యుత్ కమిషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తోందంటూ కేసీఆర్ తన పిటీషన్ లో పేర్కొన్నారు. ఈ పిటీషన్ పై హైకోర్టు విచారణ జరిపింది. ఇటీవల ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించగా.. కేసీఆర్ తరపున సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్ ఆధిత్య వాదనలు వినిపించారు. అడ్వకేట్ జనరల్ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ ఆరాధే కేసీఆర్ పిటీషన్ ను డిస్మిస్ చేశారు. విద్యుత్ కమిషన్ విచారణను కొనసాగించవచ్చు అంటూ పేర్కొన్నారు.

Also Read : పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో చంద్రబాబు, లోకేశ్ మధ్య ఆసక్తికర సంభాషణ.. సభలో నవ్వులేనవ్వులు

గత ప్రభుత్వంలో విద్యుత్ కొనుగోళ్లు వ్యవహారంపై విచారించేందుకు జస్టిస్ ఎల్. నర్సింహారెడ్డి నేతృత్వంలో కమిషన్ ఏర్పాటైన విషయం తెలిసిందే. కమిషన్ ఇప్పటికే పలువురికి నోటీసులు ఇచ్చి విచారణ చేసింది. గత ప్రభుత్వంలో సీఎండీగా ఉన్నటువంటి ప్రభాకర్ రావుకుసైతం నోటీసులు ఇచ్చి విచారించింది. అతని స్టేట్ మెంట్ ను కమిషన్ సభ్యులు రికార్డు చేశారు. మాజీ సీఎం కేసీఆర్ కు కూడా కమిషన్ రెండుసార్లు నోటీసులు ఇచ్చింది. ఆ రెండు సార్లు కేసీఆర్ విచారణకు హాజరుకాలేదు. దీనికితోడు నర్సింహారెడ్డి కమిషన్ ను రద్దు చేయాలని కోరుతూ కేసీఆర్ హైకోర్టుకు వెళ్లారు. నర్సింహారావు కమిషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తోందంటూ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేయగా.. ప్రస్తుతం ఆ పిటీషన్ ను కోర్టు కొట్టివేసింది. తాజా కోర్టు తీర్పుతో  మరోసారి కేసీఆర్ కు నోటీసులు ఇచ్చి విచారించాలని కమిషన్ భావిస్తోంది. ఈరోజు సాయంత్రం లేదా రేపు మరోసారి కేసీఆర్ కు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. ఏ తేదీన విచారణకు హాజరుకావాలని కమిషన్ నోటీసులు ఇస్తుందని ఆసక్తికరంగా మారింది. మరోవైపు హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ కేసీఆర్ సుప్రీంకోర్టుకు వెళ్తారా? లేదా కమిషన్ నోటీసులు ఇస్తే.. వారు సూచించిన తేదీన విచారణకు హాజరవుతారా అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.

Also Read : CM Chandrababu : మంగళగిరిలో లోకేశ్ గెలుపుపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు