Telangana : రాష్ట్రాలు బలంగా ఉంటేనే కేంద్రం బలంగా ఉంటుంది..అభివృద్ధిలో ముందుండే రాష్ట్రాలను ప్రోత్సహించాలి
తెలంగాణ ప్రభుత్వాన్ని గత రెండు మాసాలుగా కేంద్ర ప్రభుత్వం ఆర్ధికంగా ఇబ్బందులకు గురిచేస్తోందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆరోపించారు. ఇలా రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టటమనేది ఫెడరల్ వ్యవస్థకు విఘాతమని అన్నారు. రాష్ట్రాలు బలంగా ఉంటేనే కేంద్రం బలంగా ఉంటుందని..అభివృద్ధిలో ముందుండే రాష్ట్రాలను కేంద్రం ప్రోత్సహించాలని కేంద్రానికి సూచించారు.

Legislative Council Chairman Gutta Sukhendar Reddy Fire On Central Government
Telangana : తెలంగాణ ప్రభుత్వాన్ని గత రెండు మాసాలుగా కేంద్ర ప్రభుత్వం ఆర్ధికంగా ఇబ్బందులకు గురిచేస్తోందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆరోపించారు. ఇలా రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టటమనేది ఫెడరల్ వ్యవస్థకు విఘాతమని అన్నారు. రాష్ట్రాలు బలంగా ఉంటేనే కేంద్రం బలంగా ఉంటుందని తెలిపారు. అభివృద్ధిలో ముందుండే రాష్ట్రాలను కేంద్రం ప్రోత్సహించాలని ఆయన ఈ సందర్భంగా కేంద్రానికి సూచించారు.
మా ప్రభుత్వానికి అభివృద్ధే ముఖ్యం కానీ కులాలు కాదని అన్నారు. కానీ కొంతమంది తమ రాజకీయ స్వార్థం కోసం కులాల పేరుతో అధికారంలోకి రావాలని చూస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్‌కు తప్ప ఏ పార్టీకి అధికారం ఇచ్చినా తెలంగాణ కుక్కలు చింపిన విస్తారే అవుతుందని అన్నారు. తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రేపు ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ రానున్నారని… విభజన చట్టంలో ఉన్న ప్రతీ అంశాన్ని అమలు చేయాలని ప్రధానిని గుత్తా సుఖేందర్ రెడ్డి కోరారు.