కరోనా ఉధృతి నేపథ్యంలో తెలంగాణ వైద్యశాఖ కీలక నిర్ణయం
కరోనా ఉధృతి నేపథ్యంలో తెలంగాణ వైద్యశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వాసుపత్రుల్లో ఇప్పుడున్న బెడ్స్‌కు అదనంగా 25 బెడ్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

Telangana Medical Department Key Decision
Telangana Medical Department key decision : కరోనా ఉధృతి నేపథ్యంలో తెలంగాణ వైద్యశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వాసుపత్రుల్లో ఇప్పుడున్న బెడ్స్‌కు అదనంగా 25 బెడ్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. మరోవైపు ప్రైవేటు ఆసుపత్రుల్లో ఎలక్టివ్ ఆపరేషన్లను పోస్ట్‌పోన్ చేయాలని ఆదేశించింది. కరోనా కోసం ప్రైవేటు ఆసుపత్రుల్లో బెడ్స్ పెంచాలని కోరింది. అంతేకాక.. కరోనా రోగులను ఆసుపత్రుల్లో చేర్చేందుకు ప్రత్యేక ప్రోటోకాల్ పాటించాలని నిర్ణయించింది.
రాష్ట్రంలో కొత్తగా 3037 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. బుధవారం రాత్రి 8 గంటల వరకు మరో ఎనిమిది మంది బాధితులు మరణించగా, 897 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసులు 3,37,775కు చేరాయి. ఇందులో 1788 మంది బాధితులు వైరస్ వల్ల మరణించగా, మరో 3,08,396 మంది డిశ్చార్జీ అయ్యారు.
మొత్తం కేసుల్లో 27,861 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇందులో 18,685 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 446, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 314, నిజామాబాద్‌లో 279 చొప్పున ఉన్నాయి.