KCR Nutrition Kit : అమ్మ మనస్సుతో ఆలోచించి ‘కేసీఆర్ న్యూట్రిషన్ కిట్’ ప్రారంభించాం : మంత్రి హరీశ్ రావు

అమ్మ మనస్సుతో ఆలోచించి గర్భిణులకు కేసీఆర్ న్యూట్రిషణ్ కిట్ పథకాన్ని ప్రారంభించాం అని మంత్రి హరీశ్ రావు తెలిపారు.

KCR Nutrition Kit : అమ్మ మనస్సుతో ఆలోచించి ‘కేసీఆర్ న్యూట్రిషన్ కిట్’ ప్రారంభించాం : మంత్రి హరీశ్ రావు

minister harish rao inaugurates kcr nutrition kit

Updated On : December 21, 2022 / 2:54 PM IST

kcr nutrition kit : తెలంగాణలో మరో కొత్త పథకం ప్రారంభమైంది.అదే ‘కేసీఆర్ న్యూట్రిషన్ కిట్’. ఈ పథకాన్ని కామారెడ్డి జిల్లాలో ఆరోగ్య మంత్రి హరీశ్ రావు ప్రారంభిచారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ..అమ్మ మనస్సుతో గర్భిణుల కోసం ‘కేసీఆర్ న్యూట్రిషన్ కిట్’ పథకాన్ని ప్రారంభించామని తెలిపారు.

తొమ్మిది జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభమైంది ఈ పథకం. రక్తహీనతతో బాధపడుతున్న గర్భిణుల కోసం న్యూట్రిషన్ కిట్ చాలా ఉపయోగకరంగా ఉంటుందని అది పుట్టబోయే బిడ్డ ఆరోగ్యానికి దోహదపడుతుందని తెలిపారు మంత్రి. ఈ కిట్ లో ఖర్జూర పండ్లు, నెయ్యి, ఐరన్ సిరప్ తో పాటు ట్యాబ్లెట్లు,ప్రొటీలను గర్భిణీలు తప్పకుండా వాడాలని మంత్రి హరీశ్ రావు సూచించారు. ఈ కిట్ ను గర్భిణులకు మొత్తంగా రెండుసార్లు ఇస్తామని తెలిపారు.

మాతాశిశు సంరక్షణకు తెలంగాణ ప్రభుత్వం పెద్ద పీట వేసిందని..తల్లి, బిడ్డ బాగుండాలనే ఈ కిట్ అందిస్తున్నామని హరీశ్ రావు తెలిపారు. ప్రతి కిట్ విలువ రెండు వేల రూపాయలు ఉంటుందన్నారు. తల్లీ బిడ్డలు బాగుంటేనే సమాజం బాగుంటుందని తల్లీ బిడ్డల సంరక్షణ కోసం దేశంలో ఎక్కడా లేని పథకాలను తెలంగాణలో అమలు చేస్తున్నామని అన్నారు.  ఈకార్యక్రమంలో స్పీకర్ పోచారం, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు.