లిఫ్టులో ఇరుక్కుపోయిన మంత్రి…30 నిమిషాలపాటు అందులోనే

Minister stuck in elevator : తెలంగాణ మంత్రి కొప్పుల ఈశ్వర్ లిఫ్టులో ఇరుక్కుపోయారు. 30 నిమిషాలపాటు లిఫ్టులోనే చిక్కుకున్నారు. సిబ్బంది తీవ్రంగా శ్రమించిన అనంతరం సురక్షితంగా బయటపడ్డారు.
శుక్రవారం (నవంబర్ 6, 2020) సైఫాబాద్‌లోని ఓ కార్యక్రమానికి మంత్రి కొప్పుల ఈశ్వర్ హాజరయ్యారు. కార్యక్రమం ముగించుకుని తిరిగివస్తూ అక్కడి లిఫ్ట్‌లోకి ఎక్కారు. అయితే లిఫ్ట్ మధ్యలోనే ఆగిపోయింది.
అందులో నుంచి మంత్రిని బయటకు తీసుకువచ్చేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. సిబ్బంది 30 నిమిషాలు శ్రమించిన అనంతరం లిఫ్ట్ లాక్ ఓపెన్ అయింది. దీంతో మంత్రి సురక్షితంగా బయటపడ్డారు. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.