Telangana Ministers : రెండు రోజులుగా కేంద్రమంత్రి పీయుష్ గోయల్ కోసం తెలంగాణ మంత్రుల ఎదురుచూపులు

కేంద్రమంత్రి పీయుష్ గోయల్ కోసం రెండురోజులుగా తెలంగాణ మంత్రుల ఎదురు చూస్తున్నారు. నిన్న రాత్రి 9 గం.లకు పీయూస్ గోయల్ ను కలుద్దామనుకున్న మంత్రులు నేడు మ.3 గంటలకు వాయిదా వేసుకున్నారు.

Telangana Ministers : రెండు రోజులుగా కేంద్రమంత్రి పీయుష్ గోయల్ కోసం తెలంగాణ మంత్రుల ఎదురుచూపులు

Ministers

Updated On : November 23, 2021 / 6:28 PM IST

ministers waiting for Piyush Goyal : కేంద్రమంత్రి పీయుష్ గోయల్ కోసం రెండు రోజులుగా తెలంగాణ మంత్రుల ఎదురు చూస్తున్నారు. నిన్న రాత్రి 9 గంటలకు పీయూస్ గోయల్ ను కలుద్దామనుకున్న మంత్రులు..సమయం కుదరకపోవడంతో నేడు మధ్యాహ్నం మూడు గంటలకు వాయిదా వేసుకున్నారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటల నుంచి రెండు గంటలుగా కృషి భవన్ లో మంత్రి కోసం మంత్రులు, ఎంపీలు ఎదురుచూస్తున్నారు.

యాసంగి ధాన్యం కొనుగోళ్లపై స్పష్టత, రాష్ట్ర ప్రభుత్వం కోరినట్లుగా ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లు చేయాలని తెలంగాణ ప్రభుత్వం.. కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతోంది. నిన్న కేంద్ర ఆహార వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శిని కలిసిన సీఎస్.. రాష్ట్ర పరిస్థితులు వివరించారు.

YCP Sarpanches : నిధులు రావట్లేదని…13 మంది వైసీపీ సర్పంచ్ లు ఒకేసారి రాజీనామా

ధాన్యం కొనుగోళ్లపై స్పష్టత కోసం ముఖ్యమంత్రి, మంత్రులు, ఎంపీలు ఢిల్లీలో మకాం వేశారు. 2గంటల 45 నిముషాలుగా కేంద్ర మంత్రి కార్యాలయంలో మంత్రులు కేటీఆర్, గంగుల, నిరంజన్ రెడ్డి, ఎంపీలు పడిగాపులు కాస్తున్నారు.