Telangana : స్టేషన్ గన్‌పూర్ బీఆర్ఎస్ అసెంబ్లీ టికెట్ ఆయనదే : MLC పల్లా సంచలన ప్రకటన
హనుమకొండ జిల్లాలోని స్టేషన్ గన్ పూర్ అసెంబ్లీ బిఆర్ఎస్ టికెట్ పై క్లారిటీ ఇచ్చారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి. పల్లా చేసిన వ్యాఖ్యలు ఉమ్మడి వరంగల్ జిల్లా సహా స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారాయి.

MLC Palla Rajeshwar Reddy Station Gunpur Assembly Ticket
Telangana : వచ్చే ఎన్నికల్లో కూడా విజయం సాధించిన మూడోసారి అధికారంలోకి రావటానికి గులాబీ పార్టీ ఇప్పటినుంచే యత్నాలు ముమ్మరం చేసింది. ఓపక్క అసమ్మతి నేతలపై వేటు వేస్తు మరోపక్క అసమ్మతి నేతల స్థానాల్లో క్యాడర్ ను తమవైపు తిప్పుకోవటానికి యత్నిస్తోంది. ఇప్పటికే ఆశావహులు టికెట్లను దక్కించుకోవటానికి వారి యత్నాలు వారే చేస్తున్నారు. అధిష్టానం మెప్పు పొంది టికెట్ దక్కించుకోవటంలో బిజీబిజీగా ఉంటున్నారు.
ఈక్రమంలో హనుమకొండ జిల్లాలోని స్టేషన్ గన్ పూర్ అసెంబ్లీ బిఆర్ఎస్ టికెట్ పై క్లారిటీ ఇచ్చారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి. హనుమకొండ జిల్లా వేలేరు మండలం షోడశ పల్లి, మళ్లీ కుదుర్ల క్లస్టర్ ఆత్మీయ సమావేశంలో సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్యకు లైన్ క్లియర్ చేసారు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి. మరోసారి డాక్టర్ రాజయ్యను ఆశీర్వదించి అసెంబ్లీకి పంపాలని ప్రకటించారు పల్లా. తన ప్రకటనతో స్టేషన్ గన్ పూర్ అసెంబ్లీ టికెట్ రాజయ్యదేనని తేల్చి చెప్పారు.
ఎమ్మెల్సీ పల్లా వ్యాఖ్యలతో స్టేషన్ గన్ పూర్ నియోజకవర్గంలోని ఎమ్మెల్యే రాజయ్య వర్గీయుల ఆనందం వ్యక్తంచేస్తున్నారు.వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ను, సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్యను ఆశీర్వదించాలని పల్లా చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. స్టేషన్ ఘన్పూర్ బీఆర్ఎస్ అసెంబ్లీ టికెట్ రాజయ్యదేనంటూ పల్లా చేసిన వ్యాఖ్యలు ఉమ్మడి వరంగల్ జిల్లా సహా స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారాయి. పల్లా తన ప్రకటనతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే టిక్కెట్ ఫైట్ కు పులిస్టాప్ పెట్టారు.
కాగా ఇటీవల స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే రాజయ్యపై హన్మకొండ జిల్లా జానకీపురం మహిళా సర్పంచ్ నవ్య సంచలన ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే రాజయ్య తనకు ఫోన్ చేసిన అసభ్యంగా మాట్లాడుతున్నారని..లైంగికంగా వేధిస్తున్నారని..నీకు డబ్బు కావాలన్నా..బంగారం కావాలన్నీ ఏది కావాలన్నా ఇస్తాను నా కోరిక తీర్చు అంటూ వేధిస్తున్నారని హన్మకొండ జిల్లా జానకీపురం మహిళా సర్పంచ్ నవ్య చేసిన ఈ ఆరోపణలు పెను సంచలనంగా మారాయి.
సర్పంచ్ నవ్య చేసిన ఆరోపణలను ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఖండించారు. ఎన్నికలు దగ్గరపడుతుండటంతో కొంతమంది నాపై కుట్ర పన్ని ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని నేను ఎవ్వరికి ఫోన్లు చేయలేదు..ఎటువంటి వేధింపులకు పాల్పడలేదని రాజయ్య తెలిపారు. ఇటువంటి ఆరోపణలు వచ్చిన క్రమంలో ఎమ్మెల్సీ పల్లా రాజయ్యకు టికెట్ కన్ఫార్మ్ అని తేల్చి చెబుతు చేసిన ప్రకటన ఉమ్మడి వరంగల్ జిల్లా సహా స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది.
MLA Rajaiah Vs Women Sarpanch : మహిళా సర్పంచ్ లైంగిక వేధింపుల ఆరోపణలపై స్పందించిన ఎమ్మెల్యే రాజయ్య