Panchayat Elections : పంచాయతీ ఎన్నికలు.. ఆ ఫ్యామిలీకి లక్కేలక్కు.. సర్పంచ్ వాళ్లే.. వార్డు మెంబర్లు వాళ్లే..
Panchayat Elections: తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల నగారా మోగింది. పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేశారు
Panchayat Elections
Panchayat Elections: తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల నగారా మోగింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ మంగళవారం పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేశారు. మొత్తం మూడు దఫాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. డిసెంబర్ 11న తొలి విడత పోలింగ్ జరుగుతుంది. డిసెంబర్ 14న రెండో విడత, డిసెంబర్ 17న మూడో విడత పోలింగ్ జరుగుతుంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ ఉంటుంది. ఇప్పటికే రిజర్వేషన్లు కేటాయింపు పూర్తయిన విషయం తెలిసిందే. అయితే, సర్పంచ్ ఎన్నికల వేళ ఓ కుటుంబానికి అదృష్టం పట్టుకుంది.
పంచాయతీ ఎన్నికల సందర్భంగా గ్రామాల వారీగా సర్పంచ్, వార్డు స్థానాలకు అధికారులు రిజర్వేషన్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వికారాబాద్ జిల్లాలోని ఓ గ్రామంలో సర్పంచ్, రెండు వార్డు స్థానాలు ఎస్టీలకు రిజర్వు కావడంతో ఆ గ్రామంలో ఉన్న ఏకైక కుటుంబానికి కలిసొచ్చింది.
వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం మంతన్‌గౌడ్ గ్రామంలో 494 మంది ఓటర్లు, 8వార్డులు ఉన్నాయి. ఈ పంచాయతీ సర్పంచ్ స్థానం ఎస్టీ జనరల్ రిజర్వు అయ్యింది. అయితే, ఆ గ్రామంలో ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన ఎరుకలి భీమప్ప ఫ్యామిలీనే ఉంది. దీంతో సర్పంచ్ పదవితోపాటు.. ఎస్టీ(జనరల్), ఎస్టీ(మహిళ) వార్డు స్థానాలు కూడా ఆ కుటుంబంలోని ముగ్గురికి దక్కబోతున్నాయి.
ఎరుకలి భీమప్ప తన భార్య వెంకటమ్మతో కలిసి గ్రామంలో బుట్టలు అల్లుతూ జీవనం సాగిస్తున్నాడు. ఆయనకు ఇద్దరు కొడుకులు ఎల్లప్ప, మహేశ్, కోడళ్లు స్వప్న, సుజాత పిల్లలతో నగరంలోని చందానగర్‌లో ఉంటున్నారు.
