Manikrao Thakre : బీఆర్ఎస్ తో రక్షణ లేదని.. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ను గెలిపించాలనుకుంటున్నారు : మాణిక్ రావ్ ఠాక్రే

కాంగ్రెస్ లో చేరడానికి ఢిల్లీ రావాల్సిన అవసరం లేదని ఎక్కడైనా కాంగ్రెస్ లో చేరవచ్చన్నారు. కాంగ్రెస్ లోకి వచ్చే వారికి ఎటువంటి అడ్డంకులు లేవని.. పాతవారు కొత్త వారు కలిసి పని చేస్తారని తెలిపారు.

Manikrao Thakre : బీఆర్ఎస్ తో రక్షణ లేదని.. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ను గెలిపించాలనుకుంటున్నారు : మాణిక్ రావ్ ఠాక్రే

Manikrao Thakre

Congress Incharge Manikrao Thakre : తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ను గెలిపించాలనుకుంటున్నారని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే తెలిపారు. బీఆర్ఎస్ తో తమకు రక్షణ లేదని తెలంగాణ ప్రజలు భావిస్తున్నారని పేర్కొన్నారు. సోనియా గాంధీ వల్ల తెలంగాణ ఏర్పడింది.. హైదరాబాద్ తెలంగాణకు వచ్చిందన్నారు. అందర్నీ కలుపుకొని వెళ్లాలని కాంగ్రెస్ భావిస్తుందని చెప్పారు.

శనివారం కాంగ్రెస్ లో చేరేందుకు నకిరేకల్ నుంచి భారీగా నేతలు ఢిల్లీకి వచ్చారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వారికి కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాణిక్ రావ్ ఠాక్రే మాట్లాడుతూ హైకమాండ్ ను కలవడానికి ఢిల్లీ వస్తున్నారు.. రాష్ట్రంలోనే చేరికలు ఉంటాయని తెలిపారు.

DUSU Poll Result 2023: ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికల్లో విజయఢంకా మోగించిన ఏబీవీపీ.. ఉపాధ్యక్ష పదవి గెలుచుకున్న ఎన్ఎస్‭యూఐ

కాంగ్రెస్ లో చేరడానికి ఢిల్లీ రావాల్సిన అవసరం లేదని ఎక్కడైనా కాంగ్రెస్ లో చేరవచ్చన్నారు. కాంగ్రెస్ లోకి వచ్చే వారికి ఎటువంటి అడ్డంకులు లేవని.. పాతవారు కొత్త వారు కలిసి పని చేస్తారని తెలిపారు. కాంగ్రెస్ అధిష్టానం పెద్దలను కలిసేందుకు ఢిల్లీలో ఎదురు చూస్తున్నారు.. చేరడానికి ఎటువంటి ఇబ్బందులు లేవని చెప్పారు. తొలి విడత అభ్యర్థుల జాబితా త్వరలో విడుదల అవుతుందన్నారు.

సీఈసీ తొలి విడత అభ్యర్థుల జాబితా ప్రకటన తరువాత రెండో విడుత జాబితా విడుదల అవుతుందని తెలిపారు. ఓబీసీలు కాంగ్రెస్ తో ఉన్నారని పేర్కొన్నారు. 50శాతానికి పైగా సీట్లు మొదటి విడత లిస్ట్ లో ఉంటాయని వెల్లడించారు. స్క్రీనింగ్ కమిటీ కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీకి నివేదిక అందజేస్తుందని తదుపరి అభ్యర్థుల ప్రకటన ఉంటుందని తెలిపారు.