Telangana RTC : చిల్లర సమస్యకు పరిష్కారం-ఆర్టీసీ బస్సులో రౌండప్ చార్జీలు అమలు

తెలంగాణ ఆర్టీసీ పల్లె వెలుగు బస్సులలో చిల్లర సమస్యకు తెర పడింది.

Telangana RTC : చిల్లర సమస్యకు పరిష్కారం-ఆర్టీసీ బస్సులో రౌండప్ చార్జీలు అమలు

Ts Rtc Palle Velugu

Updated On : March 18, 2022 / 12:36 PM IST

Telangana RTC :  తెలంగాణ ఆర్టీసీ పల్లె వెలుగు బస్సులలో చిల్లర సమస్యకు తెర పడింది. చిల్లర సమస్యను గుర్తించిన ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ పలు రూట్లలో రౌండప్‌ చార్జీలను ఖరారు చేశారు. ఈ రోజు నుంచి కొత్త(రౌండప్‌) చార్జీలను ఆర్టీసీ అమలులోకి తీసుకువచ్చింది.

రూ.12చార్జీ ఉన్న టికెట్లను యాజమాన్యం రూ.10 రౌండప్‌ చేసింది. రూ.13, రూ.14 ఉన్న చోట.. ఆ టికెట్లను రూ. 15గా రౌండప్‌ చేశారు. 80 కిలోమీటర్ల దూరానికి ఇప్పటి వరకు రూ.67 వసూలు చేస్తుండగా రౌండప్‌ ఖరారుతో చార్జీలు రూ.65గా నిర్ధారించారు. టోల్ ప్లాజాల వద్ద ఆర్డినరీ బస్సుకు రూ.1.. హైటెక్, ఏసీ బస్సులకు రూ.2 వసూలు చేయనున్నారు.

Also Read : Tamilnadu : భర్తకు షాక్…పెళ్లైన నెలకే ప్రియుడ్ని పెళ్లి చేసుకున్న ఇల్లాలు