Rythu Bharosa : రైతులకు అదిరిపోయే శుభవార్త.. ఈసారి వాళ్ల బ్యాంక్ ఖాతాల్లోకీ రూ.354.96 కోట్లు జమ చేసిన సర్కార్
Rythu bharosa scheme 6th Installment : ఆరో విడతలో భాగంగా ఏడు ఎకరాల వరకు సాగుభూమి కలిగిన 92,729 మంది రైతుల ఖాతాలలో 354.96 కోట్లు జమ చేయడం జరిగిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
Telangana Rythu Bharosa Scheme 7 Acres Farmers Rs 354.96 Crore Released 6th Installment
Rythu Bharosa : తెలంగాణలోని రేవంత్ రెడ్డి సర్కార్ రైతులకు శుభవార్త చెప్పింది. రైతు భరోసా పథకం కింద వానాకాలం పంటల సాగుకు సంబంధించి పెట్టుబడి సాయం నిధులను అర్హులైన రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి ప్రభుత్వం జమ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆరో విడతలో భాగంగా ఏడు ఎకరాల వరకు సాగుభూమి కలిగిన రైతులకు రైతు భరోసా నిధులు విడుదలయ్యాయి.
ఆరో విడతలో భాగంగా ఏడు ఎకరాల వరకు సాగుభూమి కలిగిన 92,729 మంది రైతుల బ్యాంక్ ఖాతాలలో 354.96 కోట్లు జమ చేయడం జరిగిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. దీంతో రైతు భరోసా పథకం కింద ఇప్పటి వరకు 68.37 లక్షల మంది రైతులకు చెందిన 124.85 లక్షల ఎకరాలకు 7490.72 కోట్ల రైతుభరోసా నిధులు జమ చేయడం జరిగిందని మంత్రి పేర్కొన్నారు.
విడతల వారిగా ఇలా..
♦ జూన్ 30న రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించిన విషయం తెలిసిందే. అదేరోజు తొలి విడతలో రెండు ఎకరాల వరకు సాగుభూమి కలిగిన 44.27లక్షల మంది రైతులకు రూ.2,482.02 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది.
♦ రెండో విడతలో భాగంగా.. రెండు నుంచి మూడు ఎకరాల సాగుభూమి కలిగిన రైతుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా రూ.1,590.02 కోట్లను జమ చేసింది. ఈ విడతలో రాష్ట్రవ్యాప్తంగా 26.50లక్షల ఎకరాల సాగుభూమికిగాను 10.68 లక్షల మంది రైతుల బ్యాంక్ ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ అయ్యాయి.
♦ మూడో విడతలో భాగంగా మూడు నుంచి నాలుగు ఎకరాల వరకు వ్యవసాయ భూమి కలిగిన రైతుల ఖాతాల్లో రూ.1,330.32 కోట్లను ప్రభుత్వం జమ చేసింది. ఈ విడతలో రాష్ట్ర వ్యాప్తంగా 6.39 లక్షల మంది రైతులు లబ్ధి పొందగా, 22.17లక్షల ఎకరాల సాగుభూమికి రైతుభరోసా సాయం అందింది.
♦ నాల్గో విడతలో ఐదు ఎకరాల వరకు సాగుభూమి కలిగిన 4.41 లక్షల మంది రైతుల బ్యాంక్ ఖాతాల్లో రూ.1188 కోట్లను ప్రభుత్వం జమ చేసింది.
♦ ఐదో విడతలో 5 నుంచి 6 ఎకరాల వరకు సాగుభూమి కలిగిన రైతులకు రూ.545.41 కోట్లను నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది. ఈ విడతలో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 1.69 లక్షల మంది రైతులు లబ్ధిచేకూరింది.
♦ ఆరో విడతలో ఏడు ఎకరాల వరకు సాగుభూమి కలిగిన రైతులకు రైతుభరోసా నిధులు విడుదల విడుదలయ్యాయి. ఈ విడతలో 92,729 మంది రైతుల ఖాతాలలో 354.96 కోట్లను ప్రభుత్వం జమ చేసింది.
