Summer Holidays 2025: స్కూల్స్, కాలేజీల సమ్మర్ హాలిడేస్‌పై క్లారిటీ ఇచ్చిన సర్కార్.. ఎప్పటినుంచంటే..? పూర్తి వివరాలు ఇలా..

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు, ఇంటర్మీడియట్ కళాశాలలకు వేసవి సెలవులను అధికారికంగా ప్రకటించింది.

Summer Holidays 2025: స్కూల్స్, కాలేజీల సమ్మర్ హాలిడేస్‌పై క్లారిటీ ఇచ్చిన సర్కార్.. ఎప్పటినుంచంటే..? పూర్తి వివరాలు ఇలా..

Summer holidays 2025

Updated On : April 10, 2025 / 1:42 PM IST

Summer Holidays 2025: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు, ఇంటర్మీడియట్ కళాశాలలకు వేసవి సెలవులను అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం తెలంగాణలో స్కూళ్లకు ఒంటిపూట బడులు జరుగుతున్నాయి. అయితే, ఈసారి స్కూళ్లకు మరింత ముందుగానే సెలవులు ఇస్తారని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో స్కూళ్లకు, కాలేజీలకు వేసవి సెలవులపై తెలంగాణ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.

 

తెలంగాణ విద్యాశాఖ వేసవి సెలవులకు సంబంధించి స్పష్టత ఇచ్చింది.అకడమిక్ క్యాలెండర్ ప్రకారమే సెలవులు ఉంటాయని చెప్పింది. ఏప్రిల్ 24వ తేదీ నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ స్కూళ్లకు సమ్మర్ హాలిడేస్ ఇస్తున్నట్లు అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. జూన్ 11వ తేదీ వరకు సమ్మర్ హాలిడేస్ ఉంటాయని.. జూన్ 12వ తేదీ నుంచి స్కూళ్లు పున: ప్రారంభం అవుతాయని తెలంగాణ విద్యాశాఖ స్పష్టం చేసింది. దీంతో పాఠశాల విద్యార్థులకు మొత్తం 46రోజులు వేసవి సెలవులు రానున్నాయి.

 

తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ జూనియర్ కళాశాలల వేసవి సెలవుల షెడ్యూల్ ను విడుదల చేసింది. ఇంటర్ కళాశాలలకు మార్చి 31వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు వేసవి సెలవులు ఇచ్చారు. కొత్త విద్యా సంవత్సరం జూన్ 2వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. అన్ని కాలేజీలు ఈ ఉత్తర్వులను తప్పక పాటించాలని, వేసవి సెలవుల్లో క్లాసులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఇంటర్ బోర్డు హెచ్చరించింది.

 

పాఠశాల వేసవి సెలవులు
ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు
పాఠశాల పున:ప్రారంభం తేదీ జూన్ 12వ తేదీ (కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం)
సమ్మర్ హాలిడేస్ : 46 రోజులు.

ఇంటర్ కళాశాలల సెలవులు..
ఏప్రిల్ 31వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు
కళాశాలలు పున: ప్రారంభం జూన్ 2 (కొత్త విద్యా సంవత్సరం)