TG SSC Exam Schedule 2025 : అలర్ట్.. తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల.. మార్చి 21 నుంచి ఎగ్జామ్స్
తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలైంది.

Telangana SSC Exam Schedule Out now
10th Calss Exam Timetable 2025: తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. వచ్చే ఏడాది మార్చి 21నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నట్లు ఎస్ఎస్‌సీ బోర్డు తెలిపింది. పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటలకు వరకు జరగనున్నాయి.
మార్చి 21న ఫస్ట్ లాంగ్వేజ్, 22న సెకండ్ లాంగ్వేజ్, 24న ఇంగ్లీష్, 26న గణితం, 28న ఫిజిక్స్, 29న బయాలజీ, ఏప్రిల్ 2న సోషల్ స్టడీస్ పరీక్షలు జరగనున్నాయి. ఏప్రిల్ 3న ఒకేషనల్ కోర్సు పేపర్-1 భాషా పరీక్ష, 4న ఒకేషనల్ కోర్సు పేపర్-2 భాషా పరీక్ష జరగనుంది.
తెలియదు.. గుర్తులేదు.. అవగాహన లేదు..! కాళేశ్వరం విచారణ కమిషన్ ముందు స్మితా సబర్వాల్
పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ఇదే..
2025 మార్చి 21(శుక్రవారం) – ఫస్ట్ లాంగ్వేజ్
2025 మార్చి 22(శనివారం) – సెకండ్ లాంగ్వేజ్
2025 మార్చి 24(సోమవారం) – థర్డ్ లాంగ్వేజ్(ఇంగ్లీష్)
2025 మార్చి 26(బుధవారం) – గణితం
2025 మార్చి 28(శుక్రవారం) – సైన్స్(ఫిజికల్ సైన్స్)
2025 మార్చి 29(శనివారం) – సైన్స్(బయోలాజికల్ సైన్స్)
2025 ఏప్రిల్ 2(బుధవారం) – సోషల్ స్టడీస్
2025 ఏప్రిల్ 3(గురువారం) – ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ -1
2025 ఏప్రిల్ 4(శుక్రవారం) – ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ -2