Jr Colleges Bandh : తెలంగాణలో రేపు ఇంటర్ కాలేజీలు బంద్
తెలంగాణలో ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు వివాదాస్పదంగా మారాయి. ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో ఏకంగా 51శాతం మంది ఫెయిల్ కావడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఫలితాలు చూసి పలువురు విద్యార్థులు..

Jr Colleges Bandh
Jr Colleges Bandh : తెలంగాణలో ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు వివాదాస్పదంగా మారాయి. ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో ఏకంగా 51శాతం మంది ఫెయిల్ కావడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఫలితాలు చూసి పలువురు విద్యార్థులు తీవ్ర మనస్తాపానికి లోనై ఆత్మహత్యలకు పాల్పడ్డారు. దీంతో ఇంటర్ బోర్డు వైఖరి వల్ల విద్యార్థులు నష్టపోయారంటూ విమర్శలు వస్తున్నాయి. తప్పిదాలు చోటు చేసుకున్నాయంటూ ఇంటర్ బోర్డుపై ఆరోపణలు వెల్లువెత్తాయి. విద్యార్థి సంఘాలు పోరుబాట పట్టాయి. విద్యార్థులకు న్యాయం జరిగేలా NSUI(National Students of Union of India) పోరాటం చేస్తోంది. ఇంటర్ బోర్డు వైఖరికి నిరసనగా సోమవారం (డిసెంబర్ 20,2021) తెలంగాణ వ్యాప్తంగా ఇంటర్ కాలేజీల బంద్‌కు పిలుపునిచ్చింది.
ఇటీవల విడుదలైన తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ పరీక్షల ఫలితాల్లో ఏకంగా 51 శాతం మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. కేవలం 49 శాతం మంది మాత్రమే పాస్ అయ్యారు. వీరిలో కూడా చాలామంది బోర్డర్ మార్కులతో బయటపడ్డారు. ఈసారి ఒక్కరు కూడా 100 శాతం మార్కులు
సాధించలేకపోవడం గమనార్హం.
Chicken : చికెన్ అతిగా తింటున్నారా…అయితే జాగ్రత్త?
వీరంతా ఇప్పుడు ఇంటర్ సెకండియర్ చదువుతున్నారు. కరోనా నేపథ్యంలో వీరికి ఫస్టియర్ పరీక్షలు నిర్వహించ లేదు. అయితే, పరిస్థితి మెరుగుపడిన నేపథ్యంలో వీరికి పరీక్షలను నిర్వహించారు. ఫస్టియర్ పరీక్షలు ఉండవనే యోచనలో ఉన్న విద్యార్థులు ఫస్టియర్ ను పక్కన పెట్టేసి, సెకండియర్ పై ఫోకస్ పెట్టారు. ఇలాంటి సమయంలో పరీక్షలను నిర్వహించడంతో… విద్యార్థుల పరిస్థితి తారుమారైంది. దీంతోపాటు ఆన్ లైన్ విద్యాబోధన కూడా విద్యార్థులపై తీవ్ర ప్రభావాన్ని చూపింది.
వాస్తవానికి ఇప్పుడు ఇంటర్ ఫస్టియర్ ఫెయిల్ అయిన విద్యార్థులు పదో తరగతి చదువుతున్న సమయంలో కరోనా వచ్చింది. దీంతో లాక్ డౌన్లు, ఆన్ లైన్ క్లాసులు మొదలయ్యాయి. ఇది విద్యార్థుల చదువుపై తీవ్ర ప్రభావాన్నిచూపింది. చాలా మంది విద్యార్థుల దగ్గర సెల్ ఫోన్లు, ఇంటర్నెట్ సౌకర్యం కూడా లేకపోవడం ఆవేదన కలిగించే విషయం.
ప్రతి విద్యార్థికి ఇంటర్ మార్కులు చాలా కీలకం. ఇంజినీరింగ్, మెడిసిన్ సీట్లను భర్తీ చేసే క్రమంలో ఇంటర్ మార్కులకు వెయిటేజి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇంటర్ ఫస్టియర్ మార్కులు విద్యార్థుల భవిష్యత్తుపై నెగెటివ్ ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. దీంతో, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
తెలంగాణలో మరోసారి పరీక్ష ఫలితాల కారణంగా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. దీనిపై రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖాస్త్రం సంధించారు. 2019లో ఇంటర్ ఫలితాల్లో అవకతవకల కారణంగా 23 మంది విద్యార్థులు ప్రాణాలు తీసుకున్నారని, అందుకు తెలంగాణ ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. గతంలో చేసిన తప్పిదాల నుంచి ప్రభుత్వం ఏమీ నేర్చుకోలేదన్న విషయం తాజా ఫలితాలతో నిరూపితమైందన్నారు. ప్రభుత్వ అలసత్వం కారణంగా విద్యార్థుల తల్లిదండ్రుల్లో తీవ్ర ఆవేదన నెలకొందని వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం గుణపాఠం నేర్చుకుని తప్పిదాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి హితవు పలికారు.
Drinks To Burn Fat : పొట్ట చుట్టూ కొవ్వు కరగాలంటే ఈ పానీయాలు ట్రై చేసి చూడండి
51 శాతం మంది విద్యార్థులు పరీక్ష తప్పడంతో ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్ ఫస్టియర్ పరీక్షల్లో ఫెయిలైన వారికి 2022 ఏప్రిల్ లో మళ్లీ పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించింది. పరీక్ష ఫలితాలపై సందేహాలు ఉన్న వారు నిర్దేశిత రుసుము చెల్లించి జవాబు పత్రాలను పొందవచ్చని ఇంటర్ బోర్డు కార్యదర్శి తెలిపారు. ఇంటర్ ఫస్టియర్ ఫలితాలకు సంబంధించి తమకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదన్నారు.