రైతు బంధుకు రూ.7వేల 300రిలీజ్ చేయనున్న తెలంగాణ

రైతు బంధుకు రూ.7వేల 300రిలీజ్ చేయనున్న తెలంగాణ

Updated On : December 8, 2020 / 7:34 AM IST

Rythu Bandhu: సీఎం కేసీఆర్ రైతు వ్యవహరాలపై వరుస నిర్ణయాలు తీసుకుంటున్నారు. సోమవారం ఆర్థిక సహకారం అందించే క్రమంలో యాసంగి కోసం రైతు బంధు స్కీం విడుదల చేయనున్నట్లు చెప్పారు. డిసెంబర్ 27నుంచి జనవరి 7వరకూ రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేపట్టనున్నారు. ఈ క్రమంలోనే ఆర్థిక శాఖ అధికారులకు రూ.7వేల 300రిలీజ్ చేయాలని సూచించారు.

రైతు బంధు రివ్యూ మీటింగ్ లలో పాల్గొన్న సీఎం.. వ్యవసాయానికి సంబంధించిన కార్యకలాపాలను విస్తరించాలని ప్రగతి భవన్ లో చర్చించారు. రైతు బంధు స్ట్రాటజీ గురించి చర్చించి యాక్షన్ ప్లాన్ ఫైనల్ చేశారు.



రైతులందరికీ నేరుగా బ్యాంక్ అకౌంట్లలోనే నిధులు పడేలా చూడాలని చెప్పారు. ఈ కార్యక్రమం సన్న, చిన్నకారు రైతుల నుంచి మొదలుపెట్టి అందరికీ అందేలా ఏ ఒక్కరికీ ఫెయిల్ అవకుండా చూడాలని చెప్పారు. ఈ సహకార కార్యక్రమం మొత్తం పది రోజుల్లోగా జరిగిపోవాలని చెప్పారు.

పామాయిల్ ప్రాజెక్ట్:
పామాయిల్ ప్రాజెక్టును విస్తరించాలని సీఎం కేసీఆర్ ప్లాన్ చేశారు. ఈ క్రమంలోనే రూ.4వేల 800కోట్లు కేటాయించాలని నిర్ణయించారు. దీని ద్వారా 50శాతం సబ్సీడీ అందించాలని ప్లాన్ చేశారు. ‘పామాయిల్ పంట కేవలం నీరు సమృద్ధిగా 24గంటలు అందుబాటులో ఉండే ప్రాంతాలకే సాధ్యమవుతుంది. ఈ అవకాశాన్ని రైతులు వాడుకుని పెద్ద ఎత్తులో బెనిఫిట్స్ పొందుతారని’ ఆశిస్తున్నట్లు చెప్పారు.