Telangana: అమెరికాలో తెలుగు యువకుడు మృతి

కాగా తాజగా అతడు స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్ళాడు. బోటింగ్ చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు మృతి చెందాడు.

Telangana: అమెరికాలో తెలుగు యువకుడు మృతి

Telangana

Updated On : June 19, 2021 / 3:07 PM IST

Telangana: అమెరికాలో తెలుగు యువకుడు మృతి చెందాడు. తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన సిరిపురపు రవికుమార్ (26) అనే యువకుడు అమెరికాలో సిగ్నా ఇన్సూరెన్స్‌ లో పనిచేస్తున్నాడు.

కాగా తాజగా అతడు స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్ళాడు. బోటింగ్ చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు మృతి చెందాడు. స్నేహితులు రవి తల్లిదండ్రులకు ఫోన్ చేసి మృతి చెందినట్లుగా సమాచారం ఇచ్చారు. కొడుకు మృతదేహాన్ని ఇండియాకు తీసుకురావాలని తల్లిదండ్రులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నారు.