కరోనా మహమ్మారిపై వాస్తవాలు తెలియాలంటే తప్పక చూడండి.. కరోనా ఏది నిజం.. డాక్టర్ ఎంఎస్ఎస్ ముఖర్జీ మాటల్లో..

doctor mukherjee: కరోనావైరస్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ప్రజలకు నిద్ర లేకుండా చేస్తోంది. ప్రాణాలు మాస్కుల్లో పెట్టుకుని బతికేలా చేసింది. 2019 డిసెంబర్ లో చైనాలోని వుహాన్ లో వెలుగుచూసిన ఈ మహమ్మారి ప్రపంచం మొత్తాన్ని షేక్ చేస్తూనే ఉంది. ఇప్పటికే 4 కోట్ల మంది దీని బారిన పడ్డారు. 11లక్షల మందిని కోవిడ్ బలి తీసుకుంది. కొన్ని దేశాల్లో సెకండ్ వేవ్ కూడా మొదలవడం ఆందోళనకు గురి చేస్తోంది. సమర్థవంతమైన వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందా? కరోనా ఎప్పుడు ఖతం అవుతుందా? అని ప్రజలంతా ఎదురుచూస్తున్నారు. కరోనావైరస్ ని అంతం చేసే వ్యాక్సిన్ కోసం ప్రపంచ దేశాలకు చెందిన సైంటిస్టులు, వైద్య నిపుణులు తీవ్రంగా శ్రమిస్తున్న సంగతి తెలిసిందే.
కాగా, కరోనా వైరస్ పై రోజుకో కన్ ఫ్యూజన్ వెలుగులోకి వస్తోంది. వ్యాక్సిన్ పై పూటకో డిస్కషన్ జరుగుతోంది. మరి వ్యాక్సిన్ గురించి వింటున్నదంతా వాస్తవమేనా? రోజురోజుకు వైరస్ లో వస్తున్న మార్పులైనా, వ్యాక్సిన్ తయారీలో పురోగతైనా.. టెస్టుల నుంచి ట్రీట్ మెంట్ వరకు.. వాస్తవం మాత్రమే తెలుసుకుందాం. ప్రపంచాన్ని వణికిస్తున్న పాండమిక్ పై పక్కా ఇన్ ఫర్మేషన్ తెలుసుకోవాలంటే టెన్ టీవీలో ఇవాళ(అక్టోబర్ 26,2020) రాత్రి 8 గంటలకు ప్రసారం అయ్యే ”కరోనా ఏది నిజం” చూడండి. ప్రముఖ డాక్టర్ ఎంఎస్ఎస్ ముఖర్జీ కరోనావైరస్ గురించి, వ్యాక్సిన్ గురించి కీలక విషయాలు చెబుతారు. మీకున్న సందేహాలు తొలగిస్తారు.