Bairi Naresh : వెంటాడిన అయ్యప్ప భక్తులు, పరిగెత్తిన భైరి నరేశ్.. పరిగి జైలు దగ్గర ఉద్రిక్తత

వికారాబాద్ జిల్లా పరిగి సబ్ జైలు వద్ద ఉద్రిక్తత నెలకొంది. అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన భైరి నరేశ్, నిర్వాహకుడు హనుమంతును జైలుకి తరలించే సమయంలో అయ్యప్ప స్వామి భక్తులు అడ్డుకున్నారు.

Bairi Naresh : వెంటాడిన అయ్యప్ప భక్తులు, పరిగెత్తిన భైరి నరేశ్.. పరిగి జైలు దగ్గర ఉద్రిక్తత

Updated On : December 31, 2022 / 7:02 PM IST

Bairi Naresh : వికారాబాద్ జిల్లా పరిగి సబ్ జైలు వద్ద ఉద్రిక్తత నెలకొంది. అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన భైరి నరేశ్, నిర్వాహకుడు హనుమంతును జైలుకి తరలించే సమయంలో అయ్యప్ప స్వామి భక్తులు అడ్డుకున్నారు.

సబ్ జైలు వద్దకు భారీగా భక్తులు చేరుకున్నారు. దీంతో భారీ బందోబస్తు మధ్య నరేశ్, హనుమంతును జైలుకి తరలించారు పోలీసులు. పరిగి సబ్ జైలు వద్ద కాసేపు టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ ఉదయం భైరి నరేశ్, హనుమంతులను అరెస్ట్ చేసిన పోలీసులు కొడంగల్ కోర్టులో హాజరుపరచగా కోర్టు వారికి 14 రోజుల రిమాండ్ విధించింది.

Also Read..Lord Ayyappa : రేంజర్లలో ఉద్రిక్తత.. అంబేద్కర్ సంఘం నేత రాజేశ్‌ను అప్పగించాలని అయ్యప్ప స్వాముల డిమాండ్

అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యల కేసులో పోలీసులు భైరి నరేశ్ ను అరెస్ట్ చేసి కొడంగల్ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు భైరి నరేశ్ ను కొడంగల్ కోర్టు నుంచి నేరుగా పరిగి సబ్ జైలుకి తీసుకెళ్లారు. పరిగి సబ్ జైలు వద్దకి నరేశ్ ను తీసుకొస్తున్న విషయం ముందే తెలుసుకున్న అయ్యప్ప స్వామి భక్తులు పెద్ద సంఖ్యలో పరిగి సబ్ జైలు వద్దకి చేరుకున్నారు. నరేశ్ ను లోపలికి తీసుకెళ్లకుండా స్వాములు ఆందోళనకు దిగారు. దీంతో కొంతసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.

Also Read..Bairi Naresh On Ayyappa : అగ్గి రాజేసిన బైరి నరేశ్ అనుచిత వ్యాఖ్యలు.. కఠినంగా శిక్షించాలని అయ్యప్ప భక్తుల డిమాండ్

నరేశ్, హన్మంతులపై దాడి జరిగే ప్రయత్నం జరిగింది. వెంటనే పోలీసులు అప్రమత్తం అయ్యారు. భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బందోబస్తు నడుమ నరేశ్ ను పోలీసులు జైలు లోపలికి తీసుకెళ్లారు. పెద్ద ఎత్తున అక్కడికి వచ్చిన అయ్యప్ప స్వాముల ఉగ్రరూపాన్ని చూసిన నరేశ్ బిత్తరపోయాడు. భయంతో జైలు లోపలికి పరుగు తీశాడు. జైలు గేటు తోసుకుని అయ్యప్ప భక్తులు వచ్చే ప్రయత్నం చేయగా… పోలీసులు వారిని అతి కష్టం మీద అడ్డుకున్నారు. స్వాములెవరూ లోపలికి రాకుండా పోలీసులు అడ్డుకోగలిగారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

కొడంగల్ లో నిర్వహించిన అంబేద్కర్ సభలో ఓయూ విద్యార్థి, భారత నాస్తిక సమాజం అధ్యక్షుడు భైరి నరేశ్.. అయ్యప్ప స్వామిని కించపరిచేలా వ్యాఖ్యలు చేశాడు. కారుకూతలు కూశాడు. అతడి వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యింది. తెలుగు రాష్ట్రాల్లో అగ్గి రాజేసింది. ఏపీ, తెలంగాణలోని అయ్యప్పస్వామి భక్తులు, హిందూ సంఘాల నేతలు నరేశ్ పై మండిపడ్డారు. మేం నాస్తికులం.. దేవుడిని నమ్మం.. అంబేడ్కర్‌ సభ అంటేనే నాస్తికుల సభ అని బహిరంగంగానే దేవుళ్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు నరేశ్. అయ్యప్ప స్వామి జననాన్ని, పురాణాన్ని కించపరుస్తూ కారుకూతలు కూశాడు.

ఎంతోమంది నమ్మకంగా కొలిచే అయ్యప్పస్వామిని కించపరుస్తూ నరేశ్ మాట్లాడటం దుమారం రేపింది. దీనిపై అయ్యప్పస్వాములు ఆందోళనకు దిగారు. భైరి నరేశ్ ను వెంటనే పీడీ యాక్ట్‌ కింద అరెస్ట్ చేయాలని డిమాండ్‌ చేశారు. హిందూ దేవుళ్లను తిట్టడం ప్రతోడికి ఫ్యాషన్ గా మారిందని, హిందువుల దేవుళ్లను దూషిస్తే బాగా పబ్లిసిటీ వస్తుందని కొందరు ఇలా దిగజారిపోతున్నారని అయ్యప్ప భక్తులు మండిపడ్డారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే హిందూ సమాజం ఏకం కావాలన్నారు. దేవుళ్ల గురించి తప్పుగా మాట్లాడిన వాళ్లకు తగిన విధంగా బుద్ధి చెప్పాలన్నారు.