Komati Reddy : కాంగ్రెస్‌లో ‘కోమటిరెడ్డి’ టెన్షన్

తెలంగాణ కాంగ్రెస్ లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎపిసోడ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆయన కాంగ్రెస్ ను వీడతారా? లేదా? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. తాజాగా రాజగోపాల్ రెడ్డితో భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. సుమారు మూడు గంటలపాటు ఇరువురి భేటీ జరిగింది. పార్టీ వీడుతున్నట్లు వస్తున్న ప్రచారంపైనే ప్రధానంగా చర్చ జరిగింది. పార్టీని వీడవద్దని.. అందరం కలిసికట్టుగానే పోరాడుదామంటూ కోమటిరెడ్డిని భట్టి బుజ్జగించారు. అయితే భేటీ తర్వాత కూడా రాజగోపాల్‌రెడ్డి వెనక్కి తగ్గలేదు.

Komati Reddy : కాంగ్రెస్‌లో ‘కోమటిరెడ్డి’ టెన్షన్

Komatireddy

Updated On : July 26, 2022 / 11:25 AM IST

Komati Reddy Rajagopal Reddy : తెలంగాణ కాంగ్రెస్ లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎపిసోడ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆయన కాంగ్రెస్ ను వీడతారా? లేదా? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. తాజాగా రాజగోపాల్ రెడ్డితో భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. సుమారు మూడు గంటలపాటు ఇరువురి భేటీ జరిగింది. పార్టీ వీడుతున్నట్లు వస్తున్న ప్రచారంపైనే ప్రధానంగా చర్చ జరిగింది. పార్టీని వీడవద్దని.. అందరం కలిసికట్టుగానే పోరాడుదామంటూ కోమటిరెడ్డిని భట్టి బుజ్జగించారు. అయితే భేటీ తర్వాత కూడా రాజగోపాల్‌రెడ్డి వెనక్కి తగ్గలేదు.

టీ కాంగ్రెస్‌ నేతలపై మరింత దూకుడుగా స్పందించారు. తెలంగాణలో అసలు ఇప్పుడు ఒరిజినల్ కాంగ్రెస్ లేదన్నారు. నిన్న మొన్న వచ్చిన వారికి పార్టీలో పెద్ద పెద్ద పదవులు కట్టబెట్టారంటూ అసహనం వ్యక్తం చేశారు. చప్పట్లు చరిచినంత మాత్రాన ఓట్లు రాలవని రాజగోపాల్‌రెడ్డి అన్నారు. వచ్చే రోజుల్లో బీజేపీ పుంజుకుంటుందని మరోసారి స్పష్టం చేశారు. మునుగోడు ప్రజల అభిప్రాయమే.. తన అభిప్రాయమని.. వారి అభిప్రాయం ప్రకారమే నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. కేసీఆర్‌ను ఢీకొట్టాలంటే చేసే పని సీరియస్ గా ఉండాలన్నారు.

Komatireddy Rajagopal Reddy : కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా? తెలంగాణలో మరో ఉపఎన్నిక రాబోతుందా?

కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యవహారాన్ని కాంగ్రెస్‌ హైకమాండ్‌ సీరియస్‌గా తీసుకుంది. ఈసారి ఏదో ఒకటి తేల్చేందుకు.. మాణిక్కం ఠాగూర్ రంగంలోకి దిగారు. రాజగోపాల్‌ రెడ్డి ప్రెస్‌మీట్‌ క్లిప్సింగ్స్‌ను సేకరించారు. పార్టీ మారడం చారిత్రక అవసరమని, సోనియా ఈడీ విచారణపై.. చట్టం తన పని తాను చేసుకుపోతుందనడం లాంటి కామెంట్స్‌ని.. అధిష్టానం తీవ్రంగా పరిగణిస్తోంది. ఆయనపై పార్టీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్నది ఆసక్తిగా మారింది.