Revanth Reddy: అదానీ రూ.100 కోట్ల విరాళాన్ని తిరస్కరిస్తున్నామంటూ సీఎం రేవంత్ కీలక ప్రకటన
అదానీపై అమెరికాలో కేసు, ఆ గ్రూప్‌పై తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆ ఫౌండేషన్ నుంచి విరాళాన్ని తీసుకోవడం లేదని రేవంత్ రెడ్డి తెలిపారు.

CM Revanth Reddy
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి కీలక ప్రకటన చేశారు. తెలంగాణలో స్కిల్స్ ఇండియా వర్సిటీకి అదానీ గ్రూప్ ప్రకటించిన రూ.100 కోట్ల విరాళాన్ని తిరస్కరిస్తున్నట్లు తెలిపారు.
అదానీపై అమెరికాలో కేసు, అదానీ గ్రూప్‌పై తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆ ఫౌండేషన్ నుంచి విరాళాన్ని తీసుకోవడం లేదని రేవంత్ రెడ్డి తెలిపారు. దీనిపై అదానీ గ్రూపునకు లేఖ పంపినట్లు చెప్పారు. అదానీ నుంచి సర్కారు నిధులు స్వీకరించిందని పలువురు అంటున్నారని తెలిపారు.
చట్టబద్ధంగానే ఆయన నుంచి పెట్టుబడులకు అనుమతులు ఇస్తామని చెప్పారు. అలాగే, నిబంధనల ప్రకారమే టెండర్లు పిలిచి ప్రాజెక్టులు ఇస్తున్నామని తెలిపారు. భారత్‌లో ఏ కంపెనీలకైనా చట్టబద్ధంగా వ్యాపారం చేసే హక్కు ఉందని అన్నారు. అలాగే, రాష్ట్రంలో వ్యాపారం చేసుకొనే హక్కు ఉంటుందని చెప్పారు.
గత బీఆర్‌ఎస్ సర్కారు అదానీకి చాలా ప్రాజెక్టులు ఇచ్చిందని రేవంత్ రెడ్డి చెప్పారు. అదానీ నుంచి వాళ్లు కమీషన్లు తీసుకున్నారని ఆరోపించారు. తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ జైలుకు వెళ్లాలనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. జైలుకెళ్తే ముఖ్యమంత్రి కావచ్చని భావిస్తున్నారని చెప్పారు.
Telangana government rejects Rs 100cr donated by @AdaniOnline’s @AdaniFoundation to build Young India’s Skills varsity. @revanth_anumula said government has written to @AdaniFoundation chairman @AdaniPriti Telangana govt doesn’t want to get into controversy in the wake of latest… pic.twitter.com/6S7JIXB6ww
— SNV Sudhir (@sudhirjourno) November 25, 2024