నిరుద్యోగ యువతకు బంపర్ ఆఫర్.. ఒక్కొక్కరికి మూడు లక్షలు.. మొత్తం 5లక్షల మందికి లాభం.. ఇలా అప్లయ్ చేసుకోండి

నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్. రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం స్కీమ్ తీసుకొచ్చింది.

నిరుద్యోగ యువతకు బంపర్ ఆఫర్.. ఒక్కొక్కరికి మూడు లక్షలు.. మొత్తం 5లక్షల మందికి లాభం.. ఇలా అప్లయ్ చేసుకోండి

Updated On : March 16, 2025 / 10:06 AM IST

TG Rajiv Yuva Vikasam 2025: నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్. రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం స్కీమ్ తీసుకొచ్చింది. దీని ద్వారా ఒక్కో లబ్ధిదారుడికి గరిష్ఠంగా రూ.3లక్షల వరకు ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించింది.

 

తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల నిరుద్యోగ యువతను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక స్వయం ఉపాధి పథకం ‘‘రాజీవ్ యువ వికాసం’ను అమలు చేస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఈ పథకం కింద 6వేల కోట్ల బడ్జెట్ ఉంటుందని, రాష్ట్ర వ్యాప్తంగా 5లక్షల మంది యువతకు ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు.

 

రాజీవ్ యువ వికాస పథకం కింద అర్హత కలిగిన అభ్యర్థులు తమ స్వయం ఉపాధి ప్రయత్నాలకు మద్దతుగా రూ.3లక్షల వరకు ఆర్థిక సహాయం పొందచ్చు. బీసీ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండీ మల్లయ్య భట్టు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. రాజీవ్ యువ వికాసం పథకంకు సోమవారం (17వ తేదీ) నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం అవుతుందని తెలిపారు. ఏప్రిల్ 5వ తేదీ వరకు ఓబీఎంఎంఎస్ (తెలంగాణ ఆన్ లైన్ బెనిఫిషియరీ మేనేజ్ మెంట్ మానిటరింగ్) http//tgobmmsnew.cgg.gov.in ద్వారా ఈ స్కీమ్ కు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉందని మల్లయ్య భట్టు తెలిపారు. అయితే, ఈ స్కీం అర్హతలు, ఇతర వివరాలు వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచారు. ఇతర వివరాలకు జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారిని సంప్రదించాలని ఆయన సూచించారు.

 

♦ దరఖాస్తు ప్రారంభం తేదీ : మార్చి 15
♦ దరఖాస్తు గడువు : ఏప్రిల్ 5
♦ ఎంపిక, ధృవీకరణ : ఏప్రిల్ 6 నుంచి మే 31 వరకు
♦ తుది లబ్ధిదారుల జాబితా ప్రకటన : జూన్ 2(తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం)
♦ జిల్లా కలెక్టర్లు సమీక్షించి లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున ఎంపిక పత్రాలను పంపిణీ చేస్తారు.
♦ ఈ పథకాన్ని మొదటగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ కార్పొరేషన్ల ద్వారా అమలు చేస్తారు. భవిష్యత్తులో దీనిని ఇతర మార్గాలకు విస్తరించే అవకాశాలు ఉన్నాయి.
♦  ఎంపికైన అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకు లింకేజీల ద్వారా రుణాలను సులభతరం చేస్తుంది.