మందుబాబులకు గుడ్‌న్యూస్.. కొత్త మద్యం బ్రాండ్లు వచ్చేస్తున్నాయ్..! కానీ, షరతులు వర్తిస్తాయి
మద్యం ప్రియులకు గుడ్ న్యూస్. తెలంగాణ రాష్ట్రంలో త్వరలో కొత్త బ్రాండ్లు రాబోతున్నాయి. తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఈ మేరకు కసరత్తు మొదలు పెట్టింది.

Liquor
Telangana Liquor: మద్యం ప్రియులకు గుడ్ న్యూస్. తెలంగాణ రాష్ట్రంలో త్వరలో కొత్త బ్రాండ్లు రాబోతున్నాయి. ఈ మేరకు తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీజీబీసీఎల్) కసరత్తు మొదలు పెట్టింది. ప్రభుత్వం ఆదేశించిన రీతిలో కొత్త బ్రాండ్లను విక్రయించేందుకు అనుమతులు ఇవ్వనున్నారు.
Also Read: Liquor Prices Hiked : తెలంగాణలో మందుబాబులకు బిగ్ షాక్.. వాటి ధరలు పెంపు..
మార్చి 15 వరకు అవకాశం..
గతేడాది తెలంగాణ ఎక్సైజ్ శాఖ, తెలంగాణ బేవరేజేస్ కార్పొరేషన్ కొత్త మద్యం బ్రాండ్లకు అనుమతించినా విమర్శలు రావడంతో వెంటనే వెనక్కి తీసుకుంది. అయితే, ఇప్పుడు ఎలాంటి విమర్శలకు తావులేకుండా కంపెనీలకు ప్రత్యేక విధానంలో పర్మిషన్లు ఇవ్వనుంది. ఈ మేరకు టీజీబీసీఎల్ ప్రణాళికలు రూపొందించింది. రాష్ట్రంలో అందుబాటులో లేని విదేశీ మద్యం, దేశీ తయారీ విదేశీ మద్యం, బీర్ల కంపెనీలు తమ బ్రాండ్ల ఉత్పత్తులను అమ్ముకోవడానికి దరఖాస్తులను స్వీకరించనుండి. మార్చి 15వ తేదీ వరకు దరఖాస్తులకు అవకాశం కల్పించింది.
Also Read: Liquor Prices Hiked : మందుబాబులకు షాక్ ఇచ్చిన రెండు తెలుగు రాష్ట్రాలు..
నిర్ధారణ పత్రాలు సమర్పించాలి..
గతంలో విమర్శలు వచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం కొత్త మద్యం బ్రాండ్లు ఎంపిక విషయంలో టీజీబీసీఎల్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. ఈ క్రమంలో దరఖాస్తుదారులకు కీలకమైన షరతులు విధించింది. ఇప్పటికే ఇతర రాష్ట్రాల్లో తమ ఉత్పత్తులను విక్రయిస్తున్న కంపెనీలు అక్కడి బేవరేజెస్ కార్పొరేషన్ నుంచి సర్టిఫికెట్లను తీసుకురావాలని షరతు పెట్టింది. అంతేకాదు.. తమ బ్రాండ్లను నాణ్యతా ప్రమాణాల మేరకే విక్రయాలు చేస్తున్నామని, ఎలాంటి ఆరోపణలు లేవని పేర్కొంటూ నిర్దారణ పత్రంకూడా సమర్పించాలని టీజీబీసీఎల్ తమ షరతుల్లో పేర్కొంది.
అభ్యంతరాలొస్తే విచారణ ..
కొత్త కంపెనీల నుంచి వచ్చే దరఖాస్తులపైనా టీజీబీసీఎల్ కొన్ని షరతులు పెట్టింది. కొత్త కంపెనీల నుంచి వచ్చే దరఖాస్తులను పదిరోజులపాటు ఆన్ లైన్ లో ఉంచి అభ్యంతరాలను స్వీకరిస్తారు. ఆయా కంపెనీలపై ఏమైనా అభ్యంతరాలొస్తే విచారణ జరిపిన అనంతరమే అనుమతిలిచ్చే విషయంలో టీజీబీసీఎల్ తుది నిర్ణయం తీసుకోనుంది. మరోవైపు.. ఇప్పటికే రాష్ట్రంలో తమ బ్రాండ్లను సరఫరా చేస్తున్న కంపెనీలు.. కొత్త బ్రాండ్లను తీసుకురావాలని అనుకున్నా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని టీజీబీసీఎల్ కల్పించింది.