గూగుల్ పే, ఫోన్ పే ద్వారా కరెంట్ బిల్లు కట్టే వారికి షాకింగ్ న్యూస్..!

చాలా మంది విద్యుత్ వినియోగదారులు.. కరెంట్ బిల్లు చెల్లింపుల కోసం వీటిపైనే ఆధారపడ్డారు. కొందరు బ్యాంకుల ద్వారా చెల్లింపులు చేస్తున్నారు.

గూగుల్ పే, ఫోన్ పే ద్వారా కరెంట్ బిల్లు కట్టే వారికి షాకింగ్ న్యూస్..!

TGSPDCL : ఇటీవలి కాలంలో చెల్లింపులు అన్నీ ఆన్ లైన్ లోనే జరిగిపోతున్నాయి. అందుకోసం గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం, అమెజాన్ పే వంటి పేమెంట్ యాప్స్ ను తెగ వాడుతున్నారు. దాదాపు అన్ని పేమెంట్స్ కు జనాలు వీటినే ఉపయోగిస్తున్నారు. సర్వీస్ ఏదైనా పేమెంట్ మాత్రం ఈ యాప్స్ ద్వారానే చేస్తున్నారు. ఇక, చాలా మంది విద్యుత్ వినియోగదారులు.. కరెంట్ బిల్లు చెల్లింపుల కోసం వీటిపైనే ఆధారపడ్డారు. కొందరు బ్యాంకుల ద్వారా చెల్లింపులు చేస్తున్నారు. అలాంటి వారికి ఇది షాకింగ్ న్యూస్ అని చెప్పాలి. ఇకపై గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం, గూగుల్ పే వంటి డిజిటల్ పేమెంట్ గేట్ వేస్ ద్వారా కరెంటు బిల్లులు చెల్లించలేరు.

తెలంగాణలోని విద్యుత్ వినియోగదారులకు TGSPDCL షాకింగ్ న్యూస్ తెలిపింది. ఇక నుంచి కరెంట్ బిల్లులను డిజిటల్ పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్స్ ద్వారా కట్టలేరని తేల్చి చెప్పింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశాల మేరకు.. డిజిటల్ పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు గూగుల్ పే, ఫోన్ పే, అమెజాన్ పేతో పాటు బ్యాంకుల యాప్ లు, ఇతరత్రా ఏ యాప్ ల ద్వారా కూడా విద్యుత్ బిల్లులు స్వీకరించడం నిలిపివేసినట్లు TGSPDCL ప్రకటించింది. ఇక నుంచి TGSPDCL వెబ్ సైట్ లేదా TGSPDCL మొబైల్ యాప్ ద్వారా మాత్రమే నెలవారీ కరెంట్ బిల్లులు చెల్లించాలంది. ఈ మేరకు వినియోగదారులకు విజ్ఞప్తి చేసింది. ఈ సమాచారాన్ని అధికారిక ట్విట్టర్ లో ప్రకటించింది TGSPDCL.

Also Read : తెలంగాణ హైకోర్టులో కేసీఆర్‌కు బిగ్ షాక్.. పిటిషన్ కొట్టివేత