వధువు ముస్లిం..వరుడు క్రిస్టయన్..హిందూ ప్రకారం పెళ్లి

  • Published By: madhu ,Published On : August 10, 2020 / 07:53 AM IST
వధువు ముస్లిం..వరుడు క్రిస్టయన్..హిందూ ప్రకారం పెళ్లి

Updated On : August 10, 2020 / 9:24 AM IST

వధువు ముస్లిం..వరుడు క్రిస్టియన్..హిందూ ప్రకారం పెళ్లి ఏంటీ అనుకుంటున్నారా ? అవును నిజంగానే జరిగింది. మతసామరస్యాన్ని చాటి చెబుతూ జరిగిన ఈ వివాహానికి హాజరైన..నూతన వధూ వరులను ఆశీర్వదించారు. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది.



తల్వాడ మండలం అన్నారుగూడెంలో చోటు చేసుకుంది. ఈ ఊరిక చెందిన కోపెల అనీల్ కుమార్, ఖమ్మం అర్బన్ మండలం గొల్లగూడేనికి చెందిన షేక్ సోని మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరి పెళ్లికి అమ్మాయి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు.



అయితే..వరుడి కుటుంబం ఒకే చెప్పింది. ఇక పెద్దల నిర్ణయం మేరకు..హిందూ వివాహ పద్ధతిలో వధువు మెడో మూడు మూళ్లు వేశాడు పెళ్లి కొడుకు.