Heavy Rains In Telangana : తెలంగాణలో మరో మూడు రోజులు భారీ వర్షాలు.. పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్

తెలంగాణలో గత రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. 8 జిల్లాలకు ఆరెంజ్, 10 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.

Heavy Rains In Telangana : తెలంగాణలో మరో మూడు రోజులు భారీ వర్షాలు.. పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్

Heavy Rains In Telangana

Updated On : September 8, 2022 / 5:08 PM IST

Heavy Rains In Telangana : తెలంగాణలో గత రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. 8 జిల్లాలకు ఆరెంజ్, 10 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇవాళ హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. నగరంలోని రోడ్లు చెరువులను తలపించాయి. భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఎక్కడికక్కడే వెహికిల్స్ నిలిచిపోయాయి. వాహనదారులు, పాదాచారులు తీవ్ర అవస్థలు పడ్డారు.

గురువారం ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, వరంగల్‌, హన్మకొండ, జనగాం, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, నాగర్‌ కర్నూల్‌ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్‌, సిద్ధిపేట, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, వికారాబాద్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ మేరకు ఆరెంజ్‌, ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. శుక్రవారం ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

Rains in Hyderabad: హైదరాబాద్‌లో భారీ వర్షాలు.. మరో మూడు రోజులు ఇంతే..

ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలకు భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈనెల 10న ఆదిలాబాద్‌, కుమ్రంభీం, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్లల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆరెంజ్‌ హెచ్చరిక జారీ చేసింది.

జనగాం, సిద్ధిపేట, యాదాద్రి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఇదిలా ఉండగా.. ఇవాళ్టి ఉదయం వరకు రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, వికారాబాద్‌, జోగులాంబ గద్వాల, జనగాం జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. పలుచోట్ల మోస్తరు వర్షాపాతం నమోదైంది. అత్యధికంగా రంగారెడ్డి జిల్లా దండుమైలారంలో 13.4 సెంటీమీటర్లు, వికారాబాద్‌ జిల్లా దుద్యాలలో 12.1 సెంటీమీటర్ల వర్షాపాతం నమోదైందని టీఎస్‌డీపీఎస్‌ వెల్లడించింది.