Paddy Grain : తెలంగాణలో వరి ధాన్యం కొనుగోళ్లు.. పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలని ఆదేశం

రైతులకు గన్నీ బ్యాగులు, టార్పలిన్ కవర్లతోపాటు కొనుగోలు కేంద్రాల వద్ద అన్ని వసతులు సమాకూర్చాలని ఆదేశించారు. కాంటా అయిన వెంటనే ధాన్యాన్ని రైలు మిల్లులకు తరలించాలని అందుకనుగుణంగా ప్రయాణ సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు.

Paddy Grain : తెలంగాణలో వరి ధాన్యం కొనుగోళ్లు.. పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలని ఆదేశం

Paddy Grain

Updated On : April 11, 2023 / 7:41 AM IST

Paddy Grain : తెలంగాణలో మంగళవారం నుంచి వరి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు మంత్రులు అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లపై మంత్రులు హరీశ్ రావు, గంగుల కమలాకర్, నిరంజన్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లా స్థాయిలో కలెక్టర్లు కార్యాచరణ, ప్రాణాళిక రూపొందించుకుని ధాన్యం కొనుగోళ్లకు సిద్ధమవ్వాలని మంత్రలు ఆదేశించారు. రైతులు పండించిన ధాన్యాన్ని పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 7,100 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

రైతులకు గన్నీ బ్యాగులు, టార్పలిన్ కవర్లతోపాటు కొనుగోలు కేంద్రాల వద్ద అన్ని వసతులు సమాకూర్చాలని ఆదేశించారు. కాంటా అయిన వెంటనే ధాన్యాన్ని రైలు మిల్లులకు తరలించాలని అందుకనుగుణంగా ప్రయాణ సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు. అవసరమైతే మరిన్ని కొనుగోలు కేంద్రాలను సైతం ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉండాలని సూచించారు. ధాన్యం కొనుగోలు పూర్తయ్యే వరకు కొనుగోలు కేంద్రాలు ఉంచాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

CM KCR : రైతులకు సీఎం కేసీఆర్ గుడ్‌న్యూస్.. యాసంగి వరి ధాన్యం కొనుగోలుకు నిర్ణయం

యాసంగి సీజన్ సీఎంఆర్ ను ఏప్రిల్ 30వ తేదీ లోగా మిల్లర్ల నుంచి సేకరించాలని దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ఇకనుంచే సీఎంఆర్ ను అప్పగించే విషయంలో ఏమాత్రం ఆలస్యం జరిగినా ఉపేక్షించబోమని హెచ్చరించారు. దేశంలో ఆయా రాష్ట్రాల్లో రైతులు పండించిన ధాన్యాన్ని పూర్తి స్థాయిలో రెండు సీజన్లలో కొనుగోలు చేస్తున్న ఏకైక రాష్ట్రం ఒక్క తెలంగాణనే అని మంత్రులు అన్నారు.

అలాగే ఆరబెట్టిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చే విధంగా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం రాకుండా రాష్ట్ర సరిహద్దుల వద్ద చెక్ పోస్టులు ఏర్పాటు చేయలని, ప్రస్తుతం ఉన్న చెక్ పోస్టులను బలోపేతం చేయాలని మంత్రులు ఆదేశించారు. రైతులకు చెల్లింపులు ఆలస్యం జరుగకుండా ధాన్యం కొనుగోలు వివరాలు కొనుగోలు నిర్వహకులు ఎప్పటికప్పుడు ఆన్ లైన్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.