Telangana Government : భూముల అమ్మకం ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి భారీ ఆదాయం

హెచ్‌ఎండీఏ పరిధిలో ఈ-వేలం ద్వారా ప్రభుత్వం భూములను వేలం వేసింది. మిగతా జిల్లాల్లో ఓపెన్‌ ఆక్షన్‌ ద్వారా వేలాన్ని నిర్వహించింది.

Telangana Government : భూముల అమ్మకం ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి భారీ ఆదాయం

Telangana

Updated On : March 18, 2022 / 4:12 PM IST

Telangana Government : భూముల అమ్మకంతో తెలంగాణ ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరింది. 9 జిల్లాల్లో భూములను అమ్మడం ద్వారా.. ప్రభుత్వానికి రూ.503 కోట్ల ఆదాయం వచ్చింది. హెచ్‌ఎండీఏ పరిధిలో ఈ-వేలం ద్వారా ప్రభుత్వం భూములను వేలం వేసింది. మిగతా జిల్లాల్లో ఓపెన్‌ ఆక్షన్‌ ద్వారా వేలాన్ని నిర్వహించింది.

హెచ్‌ఎండీఏ పరిధిలోని తొర్రూర్, బహదూర్‌పల్లిలోని ప్లాట్ల అమ్మకం ద్వారా రూ.300 కోట్ల ఆదాయం రాగా.. నల్లగొండ, మహబూబ్‌నగర్, కామారెడ్డి, పెద్దపల్లి, ఆదిలాబాద్.. గద్వాల, వికారాబాద్ జిల్లాల్లో ఓపెన్‌ ఆక్షన్‌తో రూ.203 కోట్ల ఆదాయం సమకూరింది. చాలా చోట్ల వేలంలో ప్లాట్లు అమ్ముడు పోలేదు.