Corona Medicines : కరోనా చికిత్సలో సత్ఫలితాలిస్తున్న ఆ మూడు మందులు

కరోనా మహమ్మారి విలయం కొనసాగుతోంది. సెకండ్ వేవ్ లో మన దేశంలో మరింతగా విజృంభిస్తోంది. రోజూ లక్షల సంఖ్యలో కేసులు, వేల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. కరోనాను కట్టడి చేయడం ప్రభుత్వాలకు తలనొప్పిగా మారింది. ఇప్పటికే వ్యాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరం చేశాయి.

Corona Medicines : కరోనా చికిత్సలో సత్ఫలితాలిస్తున్న ఆ మూడు మందులు

Corona Medicines

Corona Medicines : కరోనా మహమ్మారి విలయం కొనసాగుతోంది. సెకండ్ వేవ్ లో మన దేశంలో మరింతగా విజృంభిస్తోంది. రోజూ లక్షల సంఖ్యలో కేసులు, వేల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. కరోనాను కట్టడి చేయడం ప్రభుత్వాలకు తలనొప్పిగా మారింది. ఇప్పటికే వ్యాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరం చేశాయి. కాగా, కరోనా చికిత్సకు సంబంధించి ఇంకా పెద్దఎత్తున మందులు రావాల్సి ఉంది. ప్రస్తుతానికి ఓ మూడు మందులు కరోనా రోగులకు అందించే చికిత్సలో వాడుతున్నారు. మరి ఆ మూడు మందులు ఎంతవరకు ఫలితాలు ఇస్తున్నాయి? కరోనా నుంచి కోలుకోవడంలో సాయపడుతున్నాయా? ఇంకా ఎలాంటి మెడిసిన్స్ రావాల్సి ఉంది? డాక్టర్లు, నిపుణులు ఏమంటున్నారు… దీని గురించి ప్రముఖ పల్మనాలజిస్ట్ డాక్టర్ నాగార్జున తన అభిప్రాయాలను తెలిపారు.

”లాస్ట్ వన్ మంత్ లో కరోనా చికిత్సకు 3 మందులు అందుబాటులో ఉన్నాయి. ఒకటి మోనోక్లోనల్ యాంటీబాడీస్. ఇవి మొన్నటి నుంచి అందుబాటులో ఉన్నాయి. జబ్బు నిర్దారణ అయిన 5 రోజుల్లో ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పటివరకు ఐదుగురికి ఇచ్చాము. వారంతా సేఫ్ గానే ఉన్నారు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. కానీ, మన దేశంలో ఇది ఎంతవరకు పని చేస్తుంది అనేది సమయమే చెబుతుంది. విదేశాల్లో జరిగిన స్టడీస్ లో అన్ని స్ట్రెయిన్స్(యూకే, సౌతాఫ్రికా, బ్రెజిల్) కు వ్యతిరేకంగా మోనోక్లోనల్ యాంటీబాడీస్ పని చేస్తుంది అని ఎవిడెన్స్ ఉంది. మన దేశంలో కూడా పని చేస్తుందని పాజిటివ్ హోప్ తో ఉన్నాం.

మోనోక్లోనల్ యాంటీబాడీస్ కాకుండా మరో రెండు మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయి. అందులో ఒకటి 2DG. ఈ ఔషధం మేడిన్ ఇండియా. కొత్త మందు కాదు. పదేళ్లుగా కేన్సర్ చికిత్స కోసం ప్రయోగం జరుగుతోంది. ఇప్పుడు కోవిడ్ పైన కూడా పని చేయొచ్చని కొన్ని ట్రయల్స్ లో ఎవిడెన్స్ కనిపిస్తోంది. దీనికి డీసీజీఐ ఎమర్జెన్సీ యూజ్ కోసం పర్మిషన్ ఇచ్చింది. కంప్లీట్ ఎవిడెన్స్ లేదు, పాండమిక్ సిటుయేషన్ కాబట్టి, ఎమర్జెన్సీగా మనం వాడొచ్చు అని అప్రూవల్ ఇచ్చింది. 2డీజీ నిజంగా పని చేస్తుందా అని అప్పుడు చెప్పడానికి లేదు. మనకు ఇప్పటివరకు ఉన్న డేటా ప్రకారం 300 నుంచి 400 మంది రోగులపై మాత్రమే స్టడీ జరిగింది. ఆ రిజల్ట్స్ కూడా క్లియర్ గా లేవు.

కానీ గవర్నమెంట్ కి వచ్చిన ఎవిడెన్స్ బట్టి ఈ మందు అడ్మిట్ అయిన రోగులకు ఇస్తే ఆక్సిజన్ అవసరం తగ్గుతుంది, ఆసుపత్రిలో ఎక్కువరోజులు ఉండాల్సిన అవసరం తగ్గుతుంది అని కనిపిస్తుంది. కానీ మెడిసిన్ వాడకంపై ఇంకా పెద్దఎత్తున ట్రయల్స్ జరగాలి. వాటిలో కూడా పని చేస్తుంది అని తేలితే అప్పుడు కచ్చితంగా 2డీజీని మంచి మందు కింద భావించొచ్చు. 2డీజీ మందు నిన్నటి నుంచి అన్ని ఫార్మసీస్ లో అందుబాటులో ఉంది. లాస్ట్ ఒకటి రెండు రోజుల్లో చాలామంది కరోనారోగులకు ఈ మందు ఇచ్చాము. కానీ, అందరిలోనూ ఇది పని చేసింది అని చెప్పలేకపోతున్నాం. కొంతమందిలో ఎఫెక్ట్ కనిపిస్తోంది, కొంతమందిలో లేదు. సో.. ఈ 2డీజీ కచ్చితంగా సేఫ్ మెడిసిన్. కానీ ఎంతమందికి ఉపయోగం ఉంటుంది అనే అప్పుడే చెప్పలేము.

ఇక మూడో మెడిసిన్ మోల్నుపిరవిర్. ఆల్రెడీ ఏడాదిగా ఫావిపిరవిర్ అనే మందు వాడుతున్నాం. ఈ రెండు మందులు యాంటీ వైరల్ మెడిసిన్స్ అంటాము. వైరస్ రిప్లికేషన్ ను బ్లాక్ చేస్తాయి. వైరస్ ను పెరక్కుండా ఆపుతుంది. రెండూ సేమ్ ఎంజైమ్ ని బ్లాక్ చేస్తాయి. ఫావిపిరవిర్ అనేది గతేడాది నుంచి వాడుతున్నాం. దీనిపైనా విభిన్న అభిప్రాయాలు ఉన్నాయి. పని చేస్తుందని కొంతమంది అంటారు. పని చేయదని కొంతమంది అంటారు. మోల్నుపిరవిర్ అనేది ఫావిపిరవిర్ కన్నా బెటర్ గా పని చేస్తుందని ఎర్లీ స్టడీస్ లో తెలిసింది.

మోల్నుపిరవిర్ ఇచ్చిన రోగుల్లో 5 దశల్లో వైరస్ లోడ్ జీరోకి వెళ్లిపోతున్నది ఇనీషియల్ స్టడీస్ చెబుతున్నాయి. కానీ, ఇంకా ఫేజ్ త్రీ (పెద్ద ఎత్తున) స్టడీస్ మనకు అవ్వలేదు. మోల్నుపిరవిర్ అనేది పార్ట్ ఆఫ్ క్లినికల్ స్టడీ. ట్రయల్ రూపంలో అందుబాటులో ఉంది. మన దేశంలో 35 కేంద్రాల్లో గత వారం రోజులుగా ఈ మందుని ఇవ్వడం స్టార్ట్ చేశాము. యశోదలోనూ పార్ట్ ఆఫ్ ట్రయల్ లో భాగంగా 15 నుంచి 20 మంది కరోనా రోగులకు మందు ఇవ్వడం జరిగింది.

ఈ మూడూ కొత్త మెడిసిన్స్. వీటి యొక్క ప్రత్యేకత ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఏది ఏమైనా క్లినికల్ స్టడీ అయిన తర్వాతే ఇండియన్స్ లో మోల్నుపిరవిర్ ఏ విధంగా పని చేస్తుంది అనేది కరెక్టుగా చెప్పగలము” అని పల్మనాలజిస్ట్ డాక్టర్ నాగార్జున చెప్పారు.