తెలంగాణలోని ఈ ప్రాంతాల్లో 2 రోజులపాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు

తెలంగాణలో ఉష్ణోగ్రతలు పడిపోయి వాతావరణం చల్లగా మారింది.

తెలంగాణలోని ఈ ప్రాంతాల్లో 2 రోజులపాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు

Heavy rains in Telangana

Updated On : June 11, 2025 / 9:47 AM IST

తెలంగాణలో రెండు రోజులపాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. నిన్న కూడా పలు జిల్లాల్లో వానలు పడ్డాయి.

ఇవాళ ములుగు, వికారాబాద్, జయశంకర్ భూపాలపల్లి, మహబూబ్​నగర్, జోగులాంబ గద్వాల,వనపర్తి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పింది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్​ జారీ చేసింది. పలు జిల్లాల్లో గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్‌ ఉందని చెప్పింది.

Also Read: రాజీవ్‌ యువ వికాసం స్కీమ్‌కు అప్లై చేశారా? హోల్డ్‌లో అప్లికేషన్లు!

ఉమ్మడి మహబూబ్ నగర్, వికారాబాద్ జిల్లాల్లో రేపు భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. చెట్ల కింద ఉండకూడదని చెప్పింది. మరోవైపు, బంగాళాఖాతంలో రెండు ద్రోణుల కారణంగా తెలంగాణలో ఉష్ణోగ్రతలు పడిపోయి వాతావరణం చల్లగా మారింది.