Tiger Scare In Bhadradri Dist : భద్రాద్రి జిల్లా వాసులను హడలెత్తిస్తున్న పులి సంచారం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పులిసంచారం భయాందోళనలు కలిగిస్తోంది. ఆదివారం టేకులపల్లి మండలంలోని కేవోసీ, కుంటల్ల మీదుగా రోళ్లపాడు వైపు వెళ్లిన పులిని స్థానికులు, ఫారెస్టు అధికారులు ప

Tiger Scare In Bhadradri Dist : భద్రాద్రి జిల్లా వాసులను హడలెత్తిస్తున్న పులి సంచారం

Tiger Scare

Updated On : November 22, 2021 / 10:14 AM IST

Tiger Scare In Bhadradri Dist :  భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పులిసంచారం భయాందోళనలు కలిగిస్తోంది. ఆదివారం టేకులపల్లి మండలంలోని కేవోసీ, కుంటల్ల మీదుగా రోళ్లపాడు వైపు వెళ్లిన పులిని స్థానికులు, ఫారెస్టు అధికారులు ప్రత్యక్షంగా చూశారు. కోయగూడెం ఉపరిత గని, కుంటల్ల పంచాయతీలోని అందుగులగూడెం గ్రామ సమీపాన వరి పొలం గట్టుపై వెళ్తున్న పులిని స్థానికులు సెల్‌ఫోన్‌లో వీడియో తీశారు.

మండలంలోని కుంటల్ల, అందుగులగూడెం, బద్దుతండా, నర్సాయిగూడెం, బేతంపూడి, తొమ్మిదోమైలుతండా, రోళ్లపాడు, రుక్మాతండా, బిల్యితండా తదితర అటవీ సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని టేకులపల్లి రేంజర్‌ ముక్తార్‌ హుస్సేన్‌ ఆధ్వర్యంలో గ్రామాల్లో చాటింపు వేయించారు.

Also Read : Burmese Python : జనావాసాల్లో కొండచిలువ.. హడలిపోయిన ప్రజలు