పెద్దవాగు వద్ద పెద్దపులి సంచారం…..వణుకుతున్న ప్రజలు

Tiger sighted near pedda vaagu in Telangana’s Komaram Bheem district : తెలంగాణ రాష్ట్రంలో ఇటీవలి కాలంలో పెద్దపులుల సంచారం ఆందోళన కలిగిస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, మహబూబాబాద్ జిల్లాల్లో పులి సంచారంతో ప్రజలు కంటి మీద కునకులేకుండా పోతోంది. కుమ్రం భీమ్ జిల్లాలో యువకుడిని పొట్టనపెట్టుకున్న పెద్దపులి, మహబూబాబాద్ జిల్లా గూడురు-కొత్తగూడ ప్రాంతంలో పశువులుపై దాడి చేసింది. గుంజేడు ముసలమ్మ ఆలయ పరిసర ప్రాంతంలో పులి పాదముద్రలను అధికారులు పరిశీలించారు.
తాజాగా కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికలపేట మండలం అగర్‌గూడ గ్రామ సమీపంలోని పెద్దవాగు ప్రాంతంలో గురువారం పెద్దపులి కనిపించడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. పెద్ద వాగు ప్రాంతంలో పెద్ద పులి నీరు తాగుతూ కనిపించడంతో కొందరు యువకుల వారు సెల్‌ఫోన్లతో వీడియో తీసి దాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
https://10tv.in/us-newyork-couple-house-finds-66-whiskey-bottle-inside-wall/
ఇటీవల దహెగాం మండలం దిగిడ గ్రామంలో విగ్నేశ్ అనే యువకుడిపై పెద్దపులి దాడి చేసి హతమార్చింది. తాజాగా పెంచికలపేట మండలంలో పులి కనిపించడంతో గిరిజన గ్రామాలైన మురలిగూడ, జిల్లెడ, కమ్మర్‌గాం, గుండెపల్లి, అగర్‌గూడ ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఈ విషయమై ఎఫ్‌ఆర్‌వో వేణుగోపాల్‌ను వివరణ కోరగా అగర్‌గూడ పెద్దవాగు ప్రాంతంలో పులి సంచారిస్తున్న మాట వాస్తవమేనని తెలిపారు.
తెలంగాణవాగులో దర్జాగా నీళ్లు తాగుతున్న పెద్దపులి…#Tiger #KomaramBheemDistrict #Telangana pic.twitter.com/Vqp2baszcQ
— 10Tv News (@10tvN) November 27, 2020