Revanth Reddy : సెప్టెంబర్ 17న కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల చేస్తాం : రేవంత్ రెడ్డి

కర్ణాటకలో బీజేపీ కోసం కేసీఆర్ పూర్తిగా జేడీఎస్ పక్షాన పని చేశారని విమర్శించారు. జేడీఎస్ కు ఆర్థిక సహకారం అందించి.. దాని వల్ల హంగ్ తీసుకురావాలని కేసీఆర్ పని చేశారని ఆరోపించారు.

Revanth Reddy : సెప్టెంబర్ 17న కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల చేస్తాం : రేవంత్ రెడ్డి

Revanth Reddy (2)

Updated On : May 10, 2023 / 7:14 PM IST

Revanth Reddy : సెప్టెంబర్ 17న కాంగ్రెస్ మేనిఫెస్టో ను విడుదల చేస్తామని.. ఈలోపు తొమ్మిది డిక్లరేషన్ లు విడుదల చేస్తామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే రైతు డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్ ప్రకటించామని, నెక్స్ట్ ఓబీసీ, మైనార్టీ, మహిళా డిక్లరేషన్ లు ఉంటాయని పేర్కొన్నారు. సెప్టెంబర్ 17ను కాంగ్రెస్ నిర్వహిస్తుందని.. దీన్ని తెలంగాణ స్వాతంత్ర్య దినోత్సవంగా జరుపుతామని వెల్లడించారు.

కర్ణాటకలో బీజేపీ కోసం కేసీఆర్ పూర్తిగా జేడీఎస్ పక్షాన పని చేశారని విమర్శించారు. జేడీఎస్ కు ఆర్థిక సహకారం అందించి.. దాని వల్ల హంగ్ తీసుకురావాలని కేసీఆర్ పని చేశారని ఆరోపించారు. ఈ సారి ఎంఐఎంను ఎక్కువగా పోటీ చేయనీయకుండా కేసీఆర్ చేశారని తెలిపారు. ఈ మేరకు బుధవారం రేవంత్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు.

Youth Declaration: యూత్ డిక్లరేషన్‌ను ప్రకటించిన రేవంత్ రెడ్డి.. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాల భర్తీ.. ఇంకా ఎన్నో

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్ణాటకలో గతంలో మైనార్టీకి సంబంధించిన మెజారిటీ ఓట్లు జేడీఎస్ కు పోలైనట్లు గణాంకాలు ఉన్నాయని.. అందుకే ఆ ఓట్లు చీలకుండా ఎంఐఎంను కట్టడి చేశారని వెల్లడించారు. యూత్ డిక్లరేషన్ పై ఒకటి, రెండు రోజుల్లో కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు.
బిల్డింగ్స్ నిర్మించి కేసీఆర్ అభివృద్ధి అంటుంన్నాడని తెలిపారు.

రంగు అద్దాలు, తెల్ల గోడలు అభివృద్ధికి ప్రతీకలు కాదని అంబేద్కర్ చెప్పారు.. అదే తాము నమ్ముతామని పేర్కొన్నారు. మొత్తం తొమ్మిది డిక్లరేషన్ లు ప్రకటిస్తామని చెప్పారు. ఆర్థిక అంశాలను పరిగణనలోకి తీసుకున్నాకే హామీలు ఇస్తున్నామని తెలిపారు. సోమేశ్ కుమార్ అపాయింట్ మెంట్ పై కోర్టుకు వెళ్తామని పేర్కొన్నారు. ప్రభుత్వం ఉండేది 6 నెలలైతే మూడేళ్లు ఎలా ఇస్తారని… ఇది చెల్లదన్నారు.