Traffic Restrictions: హైదరాబాద్‌లో రేపటి నుంచి ట్రాఫిక్ ఆంక్షలు

సికింద్రాబాద్ పరిధిలోని సీటీఓ జంక్షన్ నుంచి రసూల్‌పురా వరకు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయని సిటీ ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు. జూన్ నాలుగవ తేదీ వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి.

Traffic Restrictions: హైదరాబాద్‌లో రేపటి నుంచి ట్రాఫిక్ ఆంక్షలు

Traffic Restrictions

Updated On : April 20, 2022 / 5:46 PM IST

Traffic Restrictions: ఇప్పటికే హైదరాబాద్ జంట నగరాల్లో చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలవుతుండగా, గురువారం నుంచి మరో ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. సికింద్రాబాద్ పరిధిలోని సీటీఓ జంక్షన్ నుంచి రసూల్‌పురా వరకు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయని సిటీ ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు. గురువారం నుంచి జూన్ నాలుగవ తేదీ వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి.

Traffic Police : 15రోజులు వాహనం ఒకేచోట నిలిపి ఉంచితే సీజ్‌

రసూల్‌పురా పరిధిలో చేపడుతున్న నాలా మరమ్మతుల కారణంగా ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. సీటీఓ నుంచి వచ్చే వాహనాలను హనుమాన్ దేవాలయం మీదుగా దారి మళ్లిస్తారు. బేగంపేట నుంచి వచ్చే వాహనాలను రసూల్‌పురా నుంచి కిమ్స్ ఆసుపత్రి వైపు మళ్లిస్తారు. రేపటి నుంచి అమలుకాబోతున్న ట్రాఫిక్ ఆంక్షల విషయంలో వాహనదారులు సహకరించాలని ట్రాఫిక్ పోలీసులు కోరారు.