Telangana Assembly Election 2023 : రాజకీయ నేతల ర్యాష్ డ్రైవింగ్.. పెండింగులో ట్రాఫిక్ చలానాలు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమరాంగణంలో దిగిన ప్రధాన రాజకీయ పక్షాల అభ్యర్థులు రాష్ డ్రైవింగు, సిగ్నల్ జంపింగ్ లు చేస్తున్నారని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల తాజా చలానాల్లో వెల్లడైంది....

Telangana Assembly Election 2023 : రాజకీయ నేతల ర్యాష్ డ్రైవింగ్.. పెండింగులో ట్రాఫిక్ చలానాలు

traffic violation

Updated On : November 21, 2023 / 10:02 AM IST

Telangana Assembly Election 2023 : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమరాంగణంలో దిగిన ప్రధాన రాజకీయ పక్షాల అభ్యర్థులు రాష్ డ్రైవింగు, సిగ్నల్ జంపింగ్ లు చేస్తున్నారని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల తాజా చలానాల్లో వెల్లడైంది. గ్రేటర్ హైదరాబాద్ నగరంలో ఎన్నికల ప్రచార పర్వంలో బిజీగా ఉన్న బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు రాష్ డ్రైవింగ్ చేస్తూ ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు.

యథేచ్ఛగా ట్రాఫిక్ నియమాల ఉల్లంఘన

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేసే ముందు ఉన్న అన్ని ప్రభుత్వ బాకీలైన జరిమానాలు, పన్నులను మొత్తం చెల్లించాలి. నామినేషన్ దాఖలుకు ముందు ట్రాఫిక్ చలానాలను చెల్లించిన అభ్యర్థులు ఆ తర్వాత ఎన్నికల ప్రచార పర్వంలో మునిగారు. ప్రచారంలో భాగంగా అభ్యర్థుల కార్లు అనధికారిక పార్కింగ్, రాష్ డ్రైవింగ్, సిగ్నల్ జంపింగ్, స్టాప్ లైన్ క్రాసింగులకు పాల్పడ్డాయని హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీసుల రికార్డులు చెబుతున్నాయి.

రాజకీయ నేతల పెండింగ్ చలానాలు

కొందరు అభ్యర్థుల కార్ల నంబర్ ప్లేట్లు స్పోర్టింగ్ టింటెడ్ గ్లాసులపై ఉన్నాయని ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎ రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వినోద్, బీఆర్ఎస్ అభ్యర్థి వి. సునీతారెడ్డి, బీజేపీ అభ్యర్థి ఎన్ రామచందర్ రావు, ఎంఐఎం అభ్యర్థి మీర్ జుల్ఫికర్ అలీల కార్లకు ట్రాఫిక్ చలానాలు పెండింగులో ఉన్నాయి. హైదరాబాద్ నగర రోడ్లపై నుంచి వెళ్లే జిల్లాల అభ్యర్థులు సైతం ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడ్డారు.

ALSO READ : Telangana Assembly Election 2023 : కాంగ్రెస్ కట్టడికి బీఆర్ఎస్ మునుగోడు ఫార్ములా?

జాతీయ రహదారులు, పీవీఎన్‌ఆర్ ఎక్స్ ప్రెస్ వేపై వెళ్లే అభ్యర్థుల కార్లకు చలానాలు ఉన్నాయి. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి దినేష్ కుమార్ కులాచారి తన నాలుగు కార్లకు అత్యధికంగా చలాన్లు ఉన్నాయి. అతను 12వేలరూపాయల జరిమానా చెల్లించాలి. కొన్ని వాహనాలు అతని పేరుతో ఉన్న సవితా ఇన్‌ఫ్రా కంపెనీ పేరు మీద రిజిస్టర్ చేసి ఉన్నాయి. మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో నిలిచిన బీజేపీ అభ్యర్థి ఎన్‌.రామచంద్రరావు గత రెండేళ్లుగా అతివేగం, సిగ్నల్‌ జంపింగ్‌, రాంగ్‌ పార్కింగ్‌, స్టాప్‌ లైన్‌ దాటడం వంటి పలు చలాన్లతో కలిపి 8,150రూపాయల జరిమానాను ట్రాఫిక్ పోలీసులు వసూలు చేశారు.

ALSO READ : Ayodhya Ram Temple : అయోధ్య రామాలయంలో పూజారుల నియామకానికి 3వేల దరఖాస్తులు

రామచంద్రరావు మరో కారుకు 1,505 జరిమానా ఉంది. బెల్లంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వినోద్ కార్లకు ట్రాఫిక్ పోలీసులు 6,500రూపాయలకు పైగా ట్రాఫిక్ జరిమానాలు విధించారు. మజ్లిస్ పార్టీ అభ్యర్థి జుల్ఫికర్ అలీకి చెందిన రెండు కార్లను అత్యంత వేగంగా నడిపారని పోలీసులు 2,200 చలానాలు విధించారు. కాంగ్రెస్ అభ్యర్థి టి. వజ్రేష్ యాదవ్ కు చెందిన రెండు కార్లపై చలానాలు పెండింగులో ఉన్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, రాజకీయ నేతలు అనే తేడా లేకుండా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన అందరికీ తాము చలాన్ లు వేస్తామని, పెండింగులో ఉన్న జరిమానాలను కార్ల యజమానులు చెల్లించాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కోరారు.