నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో చేప ప్రసాదం పంపిణీలో విషాదం

నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో జరుగుతున్న చేప ప్రసాదం పంపిణీ లో విషాదం జరిగింది. క్యూ లైన్ లో నిలబడిన ..

నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో చేప ప్రసాదం పంపిణీలో విషాదం

Chepa Mandu Distribution (Credit_Google)

Chepa Mandu Prasadam Distribution : మృగశిర కార్తె సందర్భంగా ఆస్తమా బాధితులకు చేప మందు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. చేప మందు ప్రసాదంకోసం తెలుగు రాష్ట్రాల ప్రజలేకాక.. ఇతర రాష్ట్రాల నుంచి ప్రజలు పెద్దఎత్తున తరలివస్తున్నారు. వారికోసం నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. రెండ్రోజుల ముందే చేప మందుకోసం చాలామంది నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంకు చేరుకుని షెడ్లలో బస చేశారు. శనివారం ఉదయం 9గంటలకు ప్రారంభమైన చేప మందు పంపిణీ కార్యక్రమం.. 24గంటలపాటు సాగనుంది. అయితే, చేపమందు పంపిణీ ప్రారంభమైన కొద్ది గంటలకే అక్కడ విషాదం చోటు చేసుకుంది.

Also Read : రామోజీరావు అంత్యక్రియలు జరిగే స్థలం ఇదే.. వీడియో వైరల్

నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో జరుగుతున్న చేప ప్రసాదం పంపిణీ లో విషాదం జరిగింది. క్యూ లైన్ లో నిలబడిన నిజామాబాద్ కు చెందిన వ్యక్తి తోపులాటలో సొమ్మసిల్లి పడిపోయాడు. వెంటనే స్థానికులు అతన్ని కేర్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ప్రస్తుతం అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Also Read : ఎవరీ ఐశ్వర్య మీనన్..! మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆమెను ఎందుకు ఆహ్వానించారో తెలుసా?

నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తో కలిసి మంత్రిపొన్నం ప్రభాకర్ చేపమందు ప్రసాదం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. భారీ సంఖ్యలో ప్రజలు చేప మందును తీసుకునేందుకు నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంకు వచ్చారు. రెండు రోజుల పాటు చేప మందు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఇందుకు తగ్గట్లుగా అధికారులు ఏర్పాట్లు చేశారు. అయితే, శనివారం ఉదయం చేపమందు కోసం భారీ సంఖ్యలో ప్రజలు కూలైన్లలో వేచి ఉన్నారు. ఈ క్రమంలో తోపులాట చోటుచేసుకోవటంతో నిజామాబాద్ కు చెందిన వ్యక్తి కిందపడి గాయపడ్డారు.

Also Read : మృగశిర కార్తె సందర్భంగా చేప మందు ప్రసాదం పంపిణీ ప్రారంభం.. ఎప్పటి వరకు పంపిణీ చేస్తారంటే?