Brothers Die : అంతులేని విషాదం.. నిన్న తమ్ముడు, నేడు అన్న.. 24గంటల వ్యవధిలో అన్నదమ్ములు మృతి
జగిత్యాల జిల్లా మెట్ పల్లిలో విషాదం చోటు చేసుకుంది. 24 గంటల వ్యవధిలో ఒకే ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములు మృతి చెందారు. నిన్న మధ్యాహ్నం తమ్ముడు శ్రీనివాస్ గుండెపోటుతో మృతి చెందాడు.

Brothers Die : జగిత్యాల జిల్లా మెట్ పల్లిలో విషాదం చోటు చేసుకుంది. 24 గంటల వ్యవధిలో ఒకే ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములు మృతి చెందారు. నిన్న మధ్యాహ్నం తమ్ముడు శ్రీనివాస్ గుండెపోటుతో మృతి చెందాడు. ఇవాళ అంత్యక్రియలు జరుగుతున్న సమయంలో అన్న సచిన్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.
ఆసుపత్రికి తరలిస్తుండగా దారిలోనే మృతి చెందాడు. గంటల వ్యవధిలో ఇద్దరు కుమారులు చనిపోవడంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. అంత్యక్రియలకు వచ్చిన బంధువుల రోదనలు మిన్నంటాయి.